బాలయ్య సినిమా భగవంత్ కేసరి టైటిల్ అర్థం ఏంటంటే..?

బాలయ్యా బాబు( Balakrishna ) హీరో గా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) డైరెక్షన్ లో వస్తున్న సినిమా కి సంభందించి రోజుకి ఒక న్యూస్ బయిటికి వస్తుంది.మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి బాలయ్య 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటివరకు ఈ మూవీ పిలవబడుతూ వచ్చింది.

 Interesting Things About Balakrishna Bhagavanth Kesari Movie Title Details, Bala-TeluguStop.com

అయితే ఈరోజు అసలు టైటిల్ ను ప్రకటించారు.ఈ చిత్రానికి ‘భగవంత్ కేసరి’( Bhagavanth Kesari ) అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు కొద్దిసేపటి క్రితం ఓ పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.

‘ఐ డోంట్ కేర్’ అనేది ఉపశీర్షిక.జూన్ 10 న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.

 Interesting Things About Balakrishna Bhagavanth Kesari Movie Title Details, Bala-TeluguStop.com

ఈ టైటిల్ పోస్టర్ ను వదిలినట్టు తెలుస్తుంది.ఈ ఏడాది దసరా కానుకగా ‘భగవంత్ కేసరి’ మూవీ రిలీజ్ కాబోతోంది…

భగవంత్ అంటే విష్ణువు.కేసరి అంటే సింహం’ అన్న సంగతి తెలిసిందే.బాలయ్యకి సింహం సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు స్పష్టమవుతుంది.

మొదట ఈ చిత్రానికి ‘బ్రో.ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ ను అనుకున్నారు.కానీ ‘బ్రో’ అనే టైటిల్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఫిక్స్ చేసుకోవడంతో ఆ టైటిల్ వద్దనుకుని ‘భగవంత్ కేసరి’ వైపు మక్కువ చూపారు…

ఇక టైటిల్ పోస్టర్ లో బాలయ్య సైడ్ యాంగిల్ లో కనిపిస్తున్నారు.ఓ పక్క మాస్ గా .మరో పక్క స్టైలిష్ గా బాలయ్య ఈ పోస్టర్లో కనిపిస్తుండటం విశేషం.ఇది ఓ ఫైట్ కు సంబంధించిన పోస్టర్ అని స్పష్టమవుతుంది.

ఇక ఈ చిత్రంలో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడతారని కూడా దర్శకుడు అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేశాడు…మారి బాలయ్య బాబు తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి ఎంత వరకు అలరిస్తాడు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube