ఆ విషయంలో నిజంగా ఎన్టీఆర్ చాలా గొప్పవాడు... డైరెక్టర్ల పాలిట దేవుడు?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో దర్శకులు ఒక మంచి హిట్ సినిమా కొడితేనే వారికి తదుపరి సినిమా అవకాశాలు వస్తాయి.హీరోలు కూడా మంచి సక్సెస్ అయినటువంటి దర్శకులకు తదుపరి సినిమా అవకాశాలను ఇవ్వాలని కోరుకుంటున్నారు.

 Interesting News Viral About Ntr , Ntr, Trivikram Srinivas, Koratala Shiva,-TeluguStop.com

ఏ హీరో కూడా ఫ్లాప్ డైరెక్టర్లకు సినిమా ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడరు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగినటువంటి వారికి ఫ్లాప్ కనుక పడితే అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.

ఇక మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయాలి అన్న ఆ దర్శకులకు మనసు రాదు.దీంతో స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తూ సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి వారు ఉన్నారని చెప్పాలి.

Telugu Acharya, Koratala Shiva, Tollywood-Movie

అయితే ఇలా ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొన్నటువంటి డైరెక్టర్లకు సినిమా అవకాశాలు ఇవ్వడంలో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు.ఈయన త్రివిక్రమ్ కొరటాల శివ వంటి డైరెక్టర్లకు భారీ డిజాస్టర్లు వచ్చినప్పటికీ ఈయనతో సినిమా అంటేనే కొంతమంది హీరోలు భయపడ్డారు.అలాంటి తరుణంలో ఎన్టీఆర్( NTR ) మాత్రం ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి వారితో సినిమాలు చేసి వారిపై ఉన్నటువంటి డిజాస్టర్ మార్క్ తొలగించారని చెప్పాలి.అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు పొందినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas) కొంతకాలం పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.

అయితే ఎలాగైనా మరొక సినిమాతో హిట్టు కొట్టాలన్న కసితో ఈయన అరవింద సమేత సినిమాని సిద్ధం చేశారు.

Telugu Acharya, Koratala Shiva, Tollywood-Movie

ఈ సినిమా చేయడానికి అవకాశం ఎవరు ఇస్తారు అనుకున్నటువంటి తరుణంలో ఎన్టీఆర్ మాత్రం ఈయనని నమ్మి తనతో ఈ సినిమా చేసి బ్లాక్ బాస్టర్ అందుకున్నారు.ఇక తాజాగా కొరటాల శివ( Koratala Shiva ) ఆచార్య సినిమా ద్వారా డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన సంగతి తెలిసిందే అయితే ఇలాంటి డిజాస్టర్ సినిమాని అందించిన కొరటాలతో సినిమా అంటే హీరోలు అందరూ కూడా ఆలోచనలో పడ్డారు.అయితే అప్పటికే కమిట్ అయినటువంటి ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి తప్పుకోకుండా కొరటాలకు ధైర్యం చెబుతూ ఈ సినిమా షూటింగ్ పనులను మొదలుపెట్టారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.నిజంగా ఇలాంటి డైరెక్టర్ల పట్ల ఎన్టీఆర్ దేవుడని ఇలా అవకాశాలు కల్పించడం నిజంగా గ్రేట్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube