హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం సీతారామం. ఎటువంటి అంచనాలు లేకుండా ఇటీవల విడుదలైన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఆగస్టు 5వ తేదీన తెలుగు తమిళ భాషలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు క్రియేట్ చేసి 100 కోట్ల క్లబ్ లో చేరింది.తెలుగు తమిళ భాషలలో సినిమా గురించి మంచి టాక్ రావడంతో ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేశారు.
హిందీలో కూడా ఈ సినిమాకి మంచి ప్రేక్షకాదరణ లభించింది.బాలీవుడ్ లో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకుల మనసుని హత్తుకునే విధంగా ఉన్నాయి.ఇక ఈ సినిమాలోని పాటలు కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
సీతారామం సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందంటే థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ సినిమా జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో హను రాఘవపూడి అకౌంట్ లో మరొక హిట్ వచ్చి చేరింది.
ఇంత అద్భుతమైన ప్రేమ కావ్యం సినిమా రూపంలో తెరకెక్కటానికి కూడా ఒక కారణం ఉంది.

సీతారామం సినిమా అంతా రామ్ రాసిన ఓ లేఖ చుట్టూ తిరుగుతుంది.రామ్ రాసిన లేఖ 20 ఏళ్ల తర్వాత సీతకు ఎలా చేరింది.? అసలు ఆ లేఖలో ఏముంది.? అన్నదే ఈ కథ.అయితే హను రాఘవపూడికి ఈ లెటర్ ఆలోచన రావటానికి కోటిలో ఉన్న సెకండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణం అని తెలుసా.అవునండి .హను రాఘవపూడికి కోటిలో దొరికే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొని చదివే అలవాటు ఉంది.

ఈ క్రమంలో ఒకసారి హను ఒక పుస్తకాన్ని కొనుగోలు చేసి దాన్ని చదువుతున్న సమయంలో మధ్యలో ఒక లెటర్ ఉండటం గమనించాడు.హైదరాబాదులో ఉన్న తన కొడుకు కోసం పల్లెటూర్లో ఉన్న ఒక తల్లి రాసిన ఉత్తరం అది.ఆ ఉత్తరంతో రాఘవపూడి మదిలో ఆలోచనలు మొదలయ్యాయి.ఒక వ్యక్తికి పంపిన లేఖ, చివరికి అతనికి చేరిందా.? లేదా.? అన్న ఆలోచనలో నుంచే సీతారామం కథ పుట్టిందని చెప్పుకొచ్చాడు.ఇలా ఒక అద్భుతమైన ప్రేమ కథ కావ్యం ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆ పుస్తకమే కారణమని చెప్పాలి.







