ఈటల సస్పెన్షన్ పై న్యాయపోరాటం చేస్తామని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.స్పీకర్ పోచారంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈటల మరమనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు.ఈటల అన్న దాంట్లో తప్పేముందన్నారు.
కేంద్రాన్ని తిట్టడానికి మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదా అని నిలదీశారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్ ను సస్పెండ్ చేస్తారని చెప్పారు.







