యంగ్ హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల ప్రకటనను ఇప్పటికీ చాలామంది అభిమానులు నమ్మలేకపోతున్నారు.టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఈ జోడీ పేరు, పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ జోడీ గురించి చర్చ జరుగుతుండగా చైతన్య నుంచి విడిపోయినట్టు ప్రకటన చేసిన తర్వాత సమంత యాడ్ కు సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నారు.
వ్యక్తిగత జీవితంలో బాధలు ఉన్నా సమంత ప్రొఫెషనల్ లైఫ్ కు ప్రాధాన్యత ఇస్తూ షూటింగ్ లో పాల్గొన్నారు.
ఓల్డ్ సిటీలోని కాలేజ్ లో సమంతకు సంబంధించిన షూటింగ్ జరిగిందని సమాచారం.ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్లలో ఒకరైన విశేష్ వర్మ ఈ యాడ్ ను షూట్ చేశారు.
అయితే షూట్ సమయంలో సమంత మౌనంగా ఉన్నారని ఎవరినీ కలవలేదని తెలుస్తోంది.అదే సమయంలో సమంత కన్నీళ్లు పెట్టుకున్నారని సమాచారం.
సమంత అలా ఉండటంతో యూనిట్ సైతం టెన్షన్ పడిందని అయితే కెమెరా ముందు ఉన్న సమయంలో మాత్రం సమంత సంతోషంగా ఉన్నారని సమాచారం.డైరెక్టర్ చెప్పినట్టుగా యాడ్ షూటింగ్ ను పూర్తి చేసిన సమంత ఎన్ని బాధలున్నా ప్రొఫెషనల్ గా వ్యవహరించారని సిబ్బంది అనుకున్నట్టు తెలుస్తోంది.
మాటిమాటికి కన్నీళ్లు పెట్టుకున్న సమంత షూట్ పూర్తైన తర్వాత కూడా ఏడ్చారని సమాచారం.

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శాకుంతలం సినిమా ఇప్పటికే పూర్తైంది.సమంత తెలుగులో కొత్త ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.మరోవైపు చైతన్య సమంతల విడాకుల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సమంత, నాగచైతన్య భవిష్యత్తులో మూవీ ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో విడిపోవడానికి గల కారణాలను వెల్లడిస్తారేమో చూడాల్సి ఉంది.