టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన ఇందువదన మరో మూడు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.వరుణ్ సందేశ్ సినీ కెరీర్ లో హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం మినహా హిట్లు లేవు.
గడిచిన 13 సంవత్సరాలలో వరుణ్ సందేశ్ నటించిన సినిమాలలో చాలా సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఈ రీజన్ వల్ల ఇలా జరిగిందని ఉండదని యూనివర్స్ అన్నిటినీ ఒకచోట కలిపితేనే ఏదైనా జరుగుతుందని నమ్ముతానని వరుణ్ సందేశ్ వెల్లడించారు.
అమెరికాలో ఉన్న తాను ఇండియాకు వచ్చి సినిమాలు చేయడమే తన దృష్టిలో గొప్ప విషయమని వరుణ్ సందేశ్ వెల్లడించారు.కజిన్స్ తో మాట్లాడే సమయంలో ఆలోచిస్తే తన కజిన్స్ అంతా యూఎస్ లోనే సెటిల్ అయ్యారని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు.
తాను మాత్రమే ఇండియాలో ఉన్నానని తాను ఏదైనా పాజిటివ్ గానే తీసుకుంటానని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.ప్లానింగ్, స్క్రిప్ట్ సెలక్షన్, పర్ఫామెన్స్ వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యి ఉండవచ్చని వరుణ్ తెలిపారు.
సినిమాలు చేయడం వరకే తన బాధ్యత అని ఆ సినిమాలు జనాలకు ఏ విధంగా రీచ్ అవుతాయో చెప్పలేమని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.

తాతగారి సపోర్ట్ తనకు బాగా ఉందని వరుణ్ తెలిపారు.నా జనరేషన్ లో నేను పెద్ద అని వరుణ్ సందేశ్ తెలిపారు.తాతయ్య ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో 25 సంవత్సరాలకు పైగా ఆయన పని చేశారని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.
కరోనా వచ్చి ఎన్నో ఫ్యామిలీలు ఎఫెక్ట్ అయ్యాయని వరుణ్ తెలిపారు.

నేను ఈ స్థాయిలో ఉన్నానంటే శేఖర్ కమ్ముల కారణమని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.దిల్ రాజు ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్రమోట్ చేశారని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు.హ్యాపీడేస్ సినిమాలో తాను డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని వరుణ్ సందేశ్ వెల్లడించారు.
కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసినా, నిర్మాతగా మాత్రం చేయలేదని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు.