టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ నటుడు సుధాకర్ ( Sudhakar )గురించి మనందరికీ తెలిసిందే.ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలలో కమెడియన్ గా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలలో నటించారు సుధాకర్.
మొదట హీరోగా చేసి తర్వాత కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.వందలాది చిత్రాల్లో నటించిన ఆయన ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇలా సాగుతున్న క్రమంలో అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమ్యారు నటుడు సుధాకర్.ఈ మధ్యకాలంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ వార్తల్లో నిలుస్తున్నారు సుధాకర్.అయితే అనారోగ్య పరిస్థితుల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమైన సుధాకర్ ప్రస్తుతం గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు.ఒకప్పుడు తెరపై నవ్వించిన సుధాకర్ ని ప్రస్తుతం ఉన్న సుధాకర్ ని చూసి చాలామంది అభిమానులు బాధపడుతున్నారు.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధాకర్ తన కొడుకు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.

పెళ్ళైన చాలా ఏళ్ల వరకు సంతానం కలగలేదు.సంతానం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసాము.అలా ఒకానొక సందర్భంలో మద్రాస్( Madras ) లో ప్రముఖ చర్చిలో ప్రార్థనలు చేయగా సంతానం లభించింది అని తెలిపారు.ఆ అద్బుతంతోనే జీసస్ కు కృతజగా తన కొడుకుకు (బెన్ని) బెనెడిక్ మైఖేల్( Benedict Michael ) అని పేరు పెట్టామని తెలిపారుచెప్పుకొచ్చారు సుధాకర్.
బెన్ని గాడ్ గిఫ్ట్ సన్ అని, తను పుట్టిన తరువాత అన్ని విధాల కలిసొచ్చిందని తెలిపారు.కొడుకు పుట్టిన తరువాత క్రైస్తవ మతంలోకి మారినట్లుగా తెలిపారు.ఇక ఈ మధ్యే బెన్నీ చదువు పూర్తి చేసుకుని సినిమా రంగంలోకి రావాలని తర్ఫీదు తీసుకుంటున్నాడు.