స్టార్ హీరోయిన్ సమంత 500 రూపాయల జీతంతో కెరీర్ ను మొదలుపెట్టి ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తున్న ఏకైక హీరోయిన్ సమంత కావడం గమనార్హం.
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత కెరీర్ పై ఆ ప్రభావం ఏ మాత్రం పడలేదు.
పెళ్లి తర్వాత మురళీమోహన్ ఉంటున్న అపార్ట్మెంట్ లోనే చైసామ్ ఉండేవారనే సంగతి తెలిసిందే.
చైసామ్ విడిపోయిన తర్వాత వాళ్లు నివాసం ఉన్న ఇంటిని అమ్మేయాలని అనుకున్నామని మురళీమోహన్ తెలిపారు.అయితే సమంత మాత్రం ఆ ఇంట్లోనే తాను ఉంటానని చెప్పిందని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.
ఇప్పటికే అగ్రిమెంట్ పూర్తైందని నేను చెప్పగా అగ్రిమెంట్ చేయించుకున్న వాళ్లతో మాట్లాడి సమంత ఆ ఇంటిని కొనుగోలు చేసిందని మురళీ మోహన్ తెలిపారు.
వాస్తవానికి సమంత కొనుగోలు చేసిన ఇల్లు చైతన్యకు ఎంతో ఇష్టమైన ఇల్లు కావడం గమనార్హం.
ప్రస్తుతం సమంత తన తల్లితో కలిసి ఉంటున్నారని బోగట్టా.చైసామ్ విడాకులకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చినా అసలు కారణం మాత్రం వెలుగులోకి రాలేదు.విడాకులు సులువుగా జరగలేదని సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.
చైతన్య సమంత కలవాలని అభిమానులు కోరుకుంటుండగా చైసామ్ కలవడం సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.చైసామ్ కలిసి మరో సినిమాలో నటించడం కూడా కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శాకుంతలం, యశోద సినిమాలు సమంత రేంజ్ ను పెంచడం ఖాయమని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ భారీ బడ్జెట్ సినిమాలకు స్టార్ హీరోయిన్ సమంత భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.