స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకుడిగా స్టూడెంట్ నంబర్ 1( Student Number 1 ) సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టారు.పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి లాభాలను అందించింది.
అయితే ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) ఒక ఇంటర్వ్యూలో స్టూడెంట్ నంబర్1 సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వరుసగా 9 డైలీ సీరియల్స్ లో నేను చేశానని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.
సీరియల్స్ లో నటించే సమయంలో రోజుకు 1800, 2000 రెమ్యునరేషన్ ఇచ్చేవారని ఆయన అన్నారు.రోజుకు రెండు సీరియల్స్ లో నటించేవాడినని రోజుకు నాలుగైదు డబ్బింగ్ లు చెప్పేవాడినని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
లోకల్ యాడ్స్ కూడా చేసేవాడినని ఆయన కామెంట్లు చేశారు.శాంతినివాసం తర్వాత రాజమౌళి( Rajamouli ) స్టూడెంట్ నంబర్1 లో ఛాన్స్ ఇచ్చారని రాజీవ్ తెలిపారు.

రాజమౌళి స్టూడెంట్ నంబర్1 సినిమాకు చాలా తక్కువ రెమ్యునరేషన్ చెప్పారని ఆయన తెలిపారు.స్టూడెంట్ నంబర్1 మూవీకి నాకంటే నా వెనుక ఉన్న మోడల్స్ ఎక్కువగా సంపారించారని రాజీవ్ కామెంట్లు చేశారు.స్టూడెంట్ నంబర్1 రిలీజైన తర్వాత నెగిటివ్ టాక్ వచ్చిందని, సీరియల్ లా( Serial ) ఉందని అన్నారని మూడోరోజుకు టాక్ మారిందని రాజీవ్ వెల్లడించారు.జక్కన్న ఫస్ట్ మూవీ సక్సెస్ వెనుక ఇంత కష్టం ఉందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

స్టూడెంట్ నంబర్1 నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు జక్కన్న కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.రాజమౌళి భవిష్యత్తు సినిమాలు సైతం భారీ రేంజ్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది.
త్వరలో మహేష్( Mahesh Babu ) జక్కన్న కాంబో మూవీకి సంబంధించి సూపర్ అప్ డేట్స్ రానున్నాయని ఆ అప్ డేట్స్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడం గ్యారంటీ అని తెలుస్తోంది.







