స్నేహం కోసం సినిమాలో కృష్ణ నటించకపోవడానికి అసలు కారణమిదే?

స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.

రీఎంట్రీలో కూడా వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటిస్తూ మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్నన్ని సినిమాలు మరే హీరో చేతిలో లేవు.చిరంజీవి నటించిన సినిమాలలో స్నేహం కోసం సినిమా  కూడా ఒకటి కాగా ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

కె.ఎస్.రవికుమార్  డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 1999 సంవత్సరంలో విడుదలైంది.ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా చిరంజీవి, మీనా నటించారు.

తమిళంలో శరత్ కుమార్, సిమ్రాన్ కలిసి నటించిన నట్పుక్కాగ సినిమాకు రీమేక్ గా తెలుగులో ఈ సినిమా స్నేహం కోసం పేరుతో తెరకెక్కింది.అయితే ఈ సినిమాలో విజయ్ కుమార్ నటించిన పాత్రలో కృష్ణ నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల కృష్ణ ఆ పాత్రలో నటించలేదు.

Advertisement

చిరంజీవి, కృష్ణ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చాయి.కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ, తోడుదొంగలు సినిమాలలో చిరంజీవి, కృష్ణ కలిసి నటించారు.తోడు దొంగలు సినిమా తర్వాత చిరంజీవి, కృష్ణ కలిసి నటించలేదు.

ఖైదీ సినిమాతో చిరంజీవికి స్టార్ గా గుర్తింపు దక్కింది.నట్పుక్కాగ సినిమా బాగా నచ్చడంతో ఆ సినిమా రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపించారు.స్నేహం కోసం సినిమాలో కృష్ణ పేరు ఫైనలైజ్ కాకుండానే చిరంజీవి కృష్ణ కలిసి నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

హీరో కృష్ణకు ఈ విషయం తెలిసి ఆ సినిమాలో నటించడానికి తనకు ఆసక్తి లేదని చెప్పాలని భావించారు.ఆ పాత్ర ముసలి వ్యక్తి పాత్ర కావడంతో కృష్ణ ఆ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదు.

ఆ తర్వాత ఈ సినిమాలోని ముసలివ్యక్తి పాత్ర కోసం హీరో రాజశేఖర్ పేరును పరిశీలించారు.అయితే ఆ పాత్రలో నటించవద్దని రాజశేఖర్ కు చిరంజీవి సూచించారు.ముసలి వ్యక్తి పాత్రలో నటిస్తే రాజశేఖర్ కెరీర్ కు మైనస్ అవుతుందని చిరంజీవి భావించారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

ఆ తర్వాత విజయ్ కుమార్ ఈ సినిమాలో ఫైనల్ అయ్యారు.ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ కావడం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడం తెలిసిందే.చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్, గాడ్ ఫాదర్ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Advertisement

ఈ రెండు సినిమాలు 2022 సంవత్సరంలో రిలీజ్ కానున్నాయి.

తాజా వార్తలు