ఇంత పొడవైన రైలుని( Longest Train ) మీరు ఎక్కడా చూసుండరు.తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ భారతదేశపు అత్యంత పొడవైన రైలు వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
అంతేకాకుండా ఈ సందర్భంగా ఆయన దాని ప్రత్యేకతలను కూడా తెలియజేశారు.ఈ రైలు 3.5 కిలోమీటర్ల పొడువు కలిగి, 6 ఇంజన్లతో నడుస్తుంది.సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈ పొడవైన రైలును గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించింది.
ఇది సూపర్ వాసుకి అనే సరుకు రవాణా రైలు కావడం విశేషం.అలాగే ఇది 25,962 టన్నుల బరువుతో నడుస్తుంది.
అవును, సూపర్ వాసుకి ఇపుడు యావత్ భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు.ఐదు గూడ్స్ రైళ్లను కలిపి ఈ ఒక్క రైలును తయారు చేయడం జరిగింది.సూపర్ వాసుకి( Super Vasuki ) తీసుకువచ్చే బొగ్గు మొత్తం 3,000 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను రోజంతా ఉపయోగించడానికి సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.ఇది 90 కార్ల గూడ్స్ రైలు సామర్థ్యం కంటే 3 రెట్లు ఎక్కువన్నమాట.ఒకేసారి 9,000 టన్నుల బొగ్గును మోసుకెళ్లగలదు.267 కి.మీ దూరాన్ని కేవలం 11.20 గంటల్లో చేరుకోవడం ఈ రైలు ప్రత్యేకత.అదే సమయంలో ఈ రైలు వేగం కూడా సాధారణ సరుకు రవాణా రైళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది.
దీని వేగం సాధారణ రైలు వేగం కంటే ఎక్కువగా ఉంటుంది.సరుకు రవాణా పరంగా ఇది విశేష సేవలు అందిస్తుందని చెబుతున్నారు.ఇపుడు కేంద్రం భారతదేశ అభివృద్ధిలో రైల్వే పాత్రను( Indian Railway ) గుర్తించి విరివిగా రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసే పనిలో పడింది.
ఇటువంటి రైళ్లతో ఒక చోట నుంచి మరో చోటికి సరుకు రవాణా అనేది సులువుగా మారుతుంది.అభివృద్ధిని వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా గూడ్స్ రైళ్లను ఇపుడు ఎక్కువగా నడుపుతున్నారు.