కర్నూలు జిల్లా కోసిగిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మారెమ్మగుడి స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
వివాదం కాస్తా ముదరడంతో ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ఇరు వర్గాలను చెదరగొట్టారు.ఈ క్రమంలోనే ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.