రమ్యకృష్ణతో పరిచయం అలా ఏర్పడింది.. కృష్ణవంశీ కీలక వ్యాఖ్యలు?

టాలీవుడ్ డైరెక్టర్లలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరును సంపాదించుకున్న కృష్ణవంశీ క్రియేటివ్ సినిమాలతో పాటు ఫీల్ గుడ్ సినిమాలను సైతం తెరకెక్కించారు.

చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉన్న కృష్ణవంశీ స్వస్థలం తాడేపల్లి గూడెం.

తన తండ్రికి ఐఏఎస్ చదివించాలనే కోరిక ఉన్నా సినిమాలపై ఉన్న ఆసక్తితో కృష్ణవంశీ ఇంటర్ పూర్తి కాగానే సినిమాల వైపు వెళతానని తండ్రితో చెప్పారు.అయితే కృష్ణవంశీ నాన్న మాత్రం డిగ్రీ పూర్తి చేసిన తరువాత వెళ్లమని సూచించారు.

డిగ్రీ పూర్తైన తర్వాత రామ్ గోపాల్ వర్మ దగ్గర కృష్ణవంశీ పని చేశారు.వర్మ తనలోని మార్పులకు కారణమని కృష్ణవంశీ వెల్లడించారు.

మనీమనీ సినిమాకు తాను దర్శకత్వం వహించానని దర్శకునిగా తన పేరు వెయ్యననే హామీపై ఆ సినిమా తీశానని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.కథలను, సిద్ధాంతాలను నమ్మి కృష్ణవంశీ సినిమాలను తెరకెక్కించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

Advertisement

మహేష్ ను హీరోగా పరిచయం చేసే ఛాన్స్ వచ్చినా కృష్ణవంశీ వదులుకున్నారు.భారతం, భాగవతం స్పూర్తితో కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం.పాతబస్తీలో ముషారఫ్, బిన్ లాడెన్ ఫోటోలను చూసి కోపంతో ఖడ్గం సినిమాను కృష్ణవంశీ తెరకెక్కించారు.

ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బ్రహ్మానందం తనకు రమ్యకృష్ణను పరిచయం చేశారని కృష్ణవంశీ తెలిపారు.

అదిరింది అల్లుడు సెట్ లో రమ్యకృష్ణ పరిచయం తర్వాత ఆరు సంవత్సరాలు మాటలు, ఫోన్ కాల్స్ , షికార్లతో గడిచిపోయాయని తర్వాత పెళ్లి చేసుకున్నామని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.బాబు పేరు రిత్విక్ కృష్ణ అని కృష్ణవంశీ వెల్లడించారు.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

కృష్ణవంశీ రంగమార్తాండతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు