బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ప్రేక్షకాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సీజన్6 లో పాల్గొన్న కంటెస్టెంట్లలో బాలాదిత్య ఒకరు కాగా ఈ సీజన్ కు బాలాదిత్య విన్నర్ గా నిలిచే అవకాశం అయితే ఉందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
బాలాదిత్య బిగ్ బాస్ షోలోకి వెళ్లడానికి ముందు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
లవ్ స్టోరీలంటే ఉంటాయి కదండీ చిన్నచిన్న క్రష్ లు అంటూ బాలాదిత్య చెప్పుకొచ్చారు.
కాలేజ్ లో చదివే సమయంలో ఒక అమ్మాయిపై పాట రాశానని ఆ విధంగా చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యి పాటలు రాయడం జరిగిందని బాలాదిత్య పేర్కొన్నారు.భయంకరమైన లవ్ స్టోరీలు మాత్రం జరిగింది లేదని బాలాదిత్య చెప్పుకొచ్చారు.
మా ఫ్రెండ్ ఒకమ్మాయి పూణె వెళ్లిపోయి యూఎస్ వెళ్లిపోయిందని అలా ఫ్రెండ్స్ దూరమైన సమయంలో బాధేసి రాసిన పాటలు ఉంటాయని బాలాదిత్య పేర్కొన్నారు.
నాకు 2016 ఆగష్టు 7వ తేదీన పెళ్లి జరిగిందని వైజాగ్ కు చెందిన మానస లక్ష్మిని పెళ్లి చేసుకున్నానని బాలాదిత్య చెప్పుకొచ్చారు.
అప్పటికే నేను 9 పెళ్లిచూపులు చూశానని ఆయన కామెంట్లు చేశారు.పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి అమ్మాయి మళ్లీ సినిమాలు చేస్తావా? అని అడిగేవారని బాలాదిత్య చెప్పుకొచ్చారు.సినిమాలు చేయడం ఏమంత తప్పో నాకు అర్థం కాదని బాలాదిత్య కామెంట్లు చేశారు.

ఫ్యాషన్ తో ట్రావెల్ చేసేవాళ్లు అంటే నాకు ఇష్టమని తనకు కాబోయే భార్య అన్నారని బాలాదిత్య అన్నారు.సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఫ్యాషన్ కు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పడంలో ఆమె ఎంతగానో నచ్చి పెళ్లి చేసుకున్నానని బాలాదిత్య కామెంట్లు చేశారు.బాలాదిత్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







