తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులకు సహజ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.జయసుధ అసలు పేరు సుజాత అనే సంగతి తెలిసిందే.
జయసుధ తన సినీ కెరీర్ లో ఏకంగా 300 కు పైగా సినిమాలలో నటించడం గమనార్హం.పండంటి కాపురం నటిగా జయసుధకు తొలి సినిమా కాగా హిందీ, కన్నడ, మలయాళ, తమిళ సినిమాలలో కూడా జయసుధ నటించడం గమనార్హం.
జయసుధ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు.ఉత్తమ సహాయ నటిగా కూడా జయసుధకు పలు అవార్డులు వచ్చాయి.
జయసుధ తల్లి పేరు జోగాబాయి కాగా తండ్రి పేరు రమేష్.జయసుధ తల్లి జోగాబాయి కొన్ని సినిమాలలో బాలనటిగా నటించడంతో పాటు నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
జయసుధ తండ్రి మద్రాస్ కార్పొరేషన్ లో పని చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులలో క్యాంటీన్లను నిర్వహించేవారు.

ఈ దంపతులకు 1958 సంవత్సరం డిసెంబర్ నెలలో సుజాత(జయసుధ) జన్మించారు.సుజాతకు సినిమాలపై ఆసక్తి లేకపోవడంతో పాటు తన తల్లితో ఆమె సినిమాల గురించి చర్చించడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు.అయితే సుజాత తండ్రి రమేష్ ఆమె జాతకాన్ని జ్యోతిష్కునికి చూపించగా ఆ జ్యోతిష్కుడు మీ అమ్మాయి ఊహించని స్థాయికి ఎదుగుతుందని వెల్లడించారు.
అయితే రమేష్ ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు.

అయితే రమేష్ కు పినతండ్రి కూతురు అయిన విజయ నిర్మల పండంటి కాపురం మూవీలో చిన్న రోల్ కోసం జయసుధను తీసుకెళ్లారు.ఆ తర్వాత షూటింగ్ వాతావరణం నచ్చి జయసుధ సినిమాల్లో కొనసాగారు.అప్పటికే ఇండస్ట్రీలో సుజాత పేరుతో మరో నటి ఉండటంతో సుజాత జయసుధగా మారింది.
ఆ తర్వాత కాలంలో వరుస ఆఫర్లను అందిపుచ్చుకుని జయసుధ సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు.







