చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులు పెంచే కుక్కలతో ఎంత చక్కటి అనుబంధాన్ని ఏర్పరుచుకుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.శునకాలు కూడా తమ యజమాని పిల్లలను తమ పిల్లలుగా భావించి వారితో ఆడుకుంటాయి.
అయితే తాజాగా ఒక చిన్నారి తన కుక్కపై ప్రేమతో ఒక చిలిపి పని చేసింది.అది ఏంటంటే ఈ చిన్నారి తన కుక్కలాగా మారేందుకు మేకప్ వేసుకుంది.
దీనికి సంబంధించిన వీడియోని గుడ్ న్యూస్ మూమెంట్ అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్, 7 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో రింగులు తిరిగిన జుట్టుతో ఒక చిన్నారి కనిపించింది.ఈ చిన్నారి తన కళ్లకు నల్లటి రంగు మేకప్ గా వేసుకుంది.తర్వాత తన చెంపలకు, ముఖంపై ఇతర భాగాలకు తెల్లటి మేకప్ వేసుకుంటుంది.అయితే ఈ చిన్నారి తల్లి ఎందుకు మేకప్ వేసుకుంటున్నావ్? అని ఆ అమ్మాయిని అడిగింది.దానికి సమాధానం ఇస్తూ.“ఎందుకంటే నేను మన కుక్క ఫ్రాన్సిస్కో లాగా కనపడాలి అనుకుంటున్నా” అని ఈ చిన్నారి అమాయకంగా చెప్పుకొచ్చింది.
ఈ వీడియోలో ఫ్రాన్సిస్కో అనే కుక్కను చూడొచ్చు.దీని కళ్ల భాగం నలుపుగా మిగతా భాగం తెల్లగా ఉంది.ఈ చిన్న పిల్లను, కుక్కని పక్కనపెడితే ఇద్దరు కూడా ఒకే లాగా కనిపించారు.అయితే తన యజమాని కూతురు తనలాగా మారడంతో ఈ కుక్క చాలా ఆశ్చర్యపోతూ లుక్ ఇచ్చింది.
ఈ లుక్ చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.అలాగే చిన్నారి మేకప్ వేసుకున్న తీరును చూసి కూడా నెటిజన్లు కడుపుబ్బ నవ్వుతున్నారు.
నిజానికి ఈ చిన్నారి తన శునకం లాగా కనిపించేందుకు చాలా అద్భుతంగా మేకప్ వేసుకుంది.అందుకే ఈ చిన్నారి టాలెంట్ ని కొంతమంది తెగ పొగిడేస్తున్నారు.
ఈ హిలేరియస్ వీడియో ని మీరు కూడా చూసేయండి.







