సాధారణంగా పెంపుడు పిల్లులు తమ యజమానులతో సరదాగా ఆడుకోవడానికి బాగా ఇష్టపడుతుంటాయి.వీటిని కుటుంబంలో ఒక మెంబర్ లాగా ట్రీట్ చేస్తుంటారు ఓనర్లు.
అయితే అవి కూడా తాము జంతువులమనే విషయాన్ని మరిచి మనుషులతో మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకుంటాయి.అలా అవి మనుషులతో కమ్యూనికేట్ అయ్యే తీరు భలే ముచ్చటగా అనిపిస్తుంది.
అయితే కొన్ని పిల్లులు కొత్తగా కుటుంబంలో జాయిన్ అయిన చిన్నపిల్లలతో ఆడుకోడానికి బాగా ఆసక్తి చూపుతాయి.తాజాగా ఒక పిల్లి మాత్రం ఓ బిడ్డకి ఏకంగా మసాజ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా సైట్స్ లో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక బెడ్ పై చిన్న పిల్లోడు నిద్రించడం చూడొచ్చు.
అయితే ఈ చిన్నోడి వీపుపై తన ముందర కాళ్లతో ఓ పిల్లి మసాజ్ చేస్తూ ఉండటం కూడా గమనించవచ్చు.ఈ పిల్లి చాలా సున్నితంగా పిల్లాడికి మసాజ్ చేసింది.
ఈ క్రమంలో దీని గోర్లు కూడా బయటికి రాలేదు.ఇది తన ఓనర్ల వైపు చూస్తూ.” చూడండి మీ బాబుని ఎలా బుజ్జగిస్తున్నానో, ఈ మసాజ్ అయిపోగానే మీరు నాకు నీకు మంచి ట్రీట్ ఇవ్వాలి” అన్నట్లు ఓ లుక్ ఇచ్చింది.
ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోని చూసి చాలామంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ పిల్లి భలే ముచ్చటగా ఉంది, దీని ఎక్స్ప్రెషన్స్ నవ్వు పుట్టిస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఈ క్యాట్ మసాజ్ వీడియోకి ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
దీన్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.







