లేటు వయసులో ఘాటు ప్రేమ..!

ప్రేమకు వయసు అడ్డురాదని నిరూపించారు ఓ ప్రేమ జంట.ఏడు పదుల వయసులో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

78 ఏళ్ల వరుడిని , 79 ఏళ్ల వధువు పెళ్లాడింది .అయితే ఈ ప్రేమ ఈ పెళ్లి ఎలా జరిగింది.? లేటు వయసులో మొదలైన వీరి ఘాటు ప్రేమ ఎలా పెళ్లి వరకు వచ్చిందో తెలుసుకుందాం రండి.జిమ్ ఆడమ్స్, ఆడ్రి కౌట్స్ అనే వృద్దులు కరోనా సమయంలో ఒక డేటింగ్ యాప్ లో కలుసుకుని సెప్టెంబర్ 25న పెళ్లి చేసుకున్నారు.

వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.కోవిడ్ సమయంలో 78 ఏళ్ల ఆడమ్స్ 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం ఆన్లైన్ డేటింగ్ యాప్ లో చేరారు.

పెయింటర్, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన జిమ్ ఆడమ్స్ పెళ్లయిన 38 సంవత్సరాల తర్వాత 2017 సంవత్సరంలో తన భార్యను కోల్పోవడంతో రిటైర్డ్ ఇన్సూరెన్స్ కోసం బ్రోకర్ ఆడ్రి అనే ఆమెను డేటింగ్ యాప్ లో కలుసుకున్నాడు .ఆమె కూడా పై మూడు సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయింది.అయితే ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో వారిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.

Advertisement

ఈ విషయం గురించి జిమ్ మాట్లాడుతూ.తాను డేటింగ్ సైట్ లో తన మొదటి ప్రయాణంలో ఆడ్రిని చూశానని, ఆమెను కనుక్కోవడానికి ఒకరోజు మాత్రమే పట్టిందని, అయితే ఆ తర్వాత ఆమె తప్ప తనకు ఎవరూ అవసరం లేదనిపించిందని చెప్పాడు.

ఆడ్రి, ఆడమ్స్ 8 నెలలు ప్రేమించుకున్నారు ఆ తర్వాత కరోనా కాస్త తగ్గాక సెప్టెంబర్ 25న పెళ్లి చేసుకున్నారు.వారి పెళ్లి ఫోటోలు ఫోటోగ్రాఫర్ జూలీ రాండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ ఫోటో అందరిని ఆకర్షించింది.

కొడుకు జేజే ఆడమ్స్ కూడా తన ట్విట్టర్ లో వారి పెళ్లి ఫోటోను పోస్ట్ చేశాడు.దీంతో వైరల్ గా మారిన ఈ పోస్ట్ ను నెటీజన్లకు అత్యంత వేగంగా చేరి వైరల్ గా మారింది.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు