ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ సోదాలలో ఇప్పటివరకు రూ.100 కోట్ల విలువైన మద్యంతో పాటు నగదు, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా( Mukesh Kumar Meena ) తెలిపారు.ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు, మద్యం, డ్రగ్స్ వంటి వాటిని అక్రమంగా తరలిస్తున్నారని వెల్లడించారు.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిర్వహించిన సోదాల్లో రూ.11 కోట్లతో పాటు ఏడు కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.అదేవిధంగా ఇప్పటివరకు 3300 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు