తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.గత ప్రభుత్వ అవినీతిని అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి వేల కోట్ల సెటిల్ మెంట్లు చేస్తున్నారని తెలిపారు.
సొంత మనుషులతో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కన్నేశారని మహేశ్వర్ రెడ్డి( Maheshwar Reddy ) ఆరోపించారు.పార్థసారథి రెడ్డికి చెందిన హెటిరో డ్రగ్స్ ఇచ్చిన 15 ఎకరాల భూమి విషయంలో సెటిల్ మెంట్ జరిగిందని చెప్పారు.
గతంలో పార్థసారథిరెడ్డికి ( Parthasarathi Reddy ) ఇచ్చిన భూమిపై కోర్టుకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనతో సెటిల్ మెంట్ చేసుకున్నారని పేర్కొన్నారు.జీవో 37 ఇచ్చి పార్థసారథికి సీఎం రేవంత్ రెడ్డి సహకరించారన్నారు.ప్రభుత్వ రేటు ప్రకారం పార్థసారథి రెడ్డికి ఇచ్చిన భూమి విలువ రూ.505 కోట్లన్న ఆయన అవినీతిపై విచారణ చేయకుండా రేవంత్ రెడ్డి సెటిల్ మెంట్లు చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు.ఆర్, బీ ట్యాక్స్ పై బీజేపీ దగ్గర ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.