తెలంగాణ గిరిజన రిజర్వేషన్ పెంపు ఉత్తర్వులపై సుప్రీంలో విచారణ

తెలంగాణ గిరిజన రిజర్వేషన్ పెంపు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది.రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న జీవోను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఆదివాసీ సంఘాల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

కొత్త జీవోతో రిజర్వేషన్లు 50 శాతం దాటుతాయని ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి.అంతేకాదు చెల్లప్ప కమిషన్ 9 శాతం వరకే రిజర్వేషన్లు పెంచుకోవాలని సూచించిందని ఆదివాసీ సంఘాలు తెలిపాయి.

తెలంగాణ జీవోతో సుగాలి, లంబాడా, బంజారాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని వాదనలు వినిపించింది.తెలంగాణ హైకోర్టులో జీవోను సవాల్ చేయాలని సూచించింది.

Advertisement
ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి

తాజా వార్తలు