AP DSC : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్( AP DSC notification ) పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు.

అయితే ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందున పిటిషన్ ను రేపు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.ఈ సందర్భంగా ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు( Supreme Court ) నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తెలిపారు.

దీనిపై బీఈడీ( BED ) అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.దీనిపై హైకోర్టు స్పందిస్తూ.సుప్రీం తీర్పు స్పష్టంగా ఉన్నా బీఎడ్ అభ్యర్థులను ఎలా అనుమతించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి సెలవు కారణంగా రేపు విచారిస్తామని వెల్లడించింది.

Advertisement
ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి

తాజా వార్తలు