ఆదిలాబాద్ జిల్లాలో ఇంజెక్షన్ దాడి కలకలం

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఇంజెక్షన్ దాడి కలకలం సృష్టించింది.బస్టాండ్ లో నిల్చున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి గుర్తు తెలియని దుండగులు ఇంజక్షన్ పొడిచారు.

బైక్ పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఇంజక్షన్ పొడిచి పరారైనట్లు బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు తెలిపారు.ఇంజక్షన్ ప్రభావంతో సదరు యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

రోడ్డుపై పడిపోయిన శ్రీకాంత్ ను స్థానికులు హుటాహుటిన రిమ్స్ కు తరలించారు.అయితే బాధితుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు