అమానుషం.. ఒకేసారి గాల్లో కలిసిపోయిన 43 మంది కూలీల ప్రాణాలు..!

తాజాగా మానవాళి భయపడే విధంగా తీవ్రవాదులు ఓ ఘాతుకానికి పాల్పడ్డారు.దీంతో ఏకంగా 43 మంది కూలీలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

మంచి, మానవత్వం లాంటివి పూర్తిగా మరిచిపోయి వన్య జంతువుల కంటే దారుణంగా వ్యవహరించిన తీవ్రవాద చర్యలకు బతుకు జీవనం కోసం రేయింబవళ్లు కష్టజీవులుగా పనిచేసే కూలీల ప్రాణాలు కోల్పోయారు.పొలం పనులకు వెళ్లిన 43 మంది వ్యవసాయ కూలీలను అతి దారుణంగా తీవ్రవాదులు హతమార్చారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఈ నైజీరియా దేశంలోని బోకో హోరం ప్రాంతంలో చోటు చేసుకుంది.

రైతులు పొలంలో పని చేసుకుంటుండగా అక్కడ పనిచేసే వారిని తీసుకువెళ్లి.ఆ తర్వాత వారి చేతులను వెనక్కి విరిచి, కట్టెలకు కట్టేసి ఆపై గొంతులు కోసి చంపేశారు తీవ్రవాదులు.

Advertisement

నైజీరియా దేశంలోని మైదుగురి నగర సమీపంలో ఈ సంఘటన సంభవించడంతో ఆ దేశంలో ప్రస్తుతం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈ సంఘటనపై తాజాగా ఐక్యరాజ్యసమితి అత్యంత భయానక ఘటనగా పేర్కొంది.

ఈ ఘటనకు సంబంధించి బోకో హోరం తీవ్రవాదులు పాల్పడినట్లు వారు తెలిపారు.ఉగ్రవాదుల చేతిలో హతమైన రైతులకు ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలను నిర్వహించింది.

అసాధారణ మారణ కాండలో హత్యకు గురైన 48 కూలీలతో పాటు మరో ఆరుగురు తీవ్ర గాయాలతో పడి ఉన్న వారిని కూడా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.చనిపోయిన కూలీలందరి కూడా నైజీరియాలోని ఓ ప్రాంతానికి చెందినవారు అదికూడా వెయ్యి కిలోమీటర్లు నుంచి పొట్టకూటికోసం ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ వారు వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారే.

స్థానికంగా ఓ రైతు పొలంలో పని చేయడానికి కాంట్రాక్ట్ పనిపై వారు అక్కడికి రాగా వారు పొలంలో పని చేస్తుండగా ఈ దారుణ సంఘటన జరిగింది.ఈ సంఘటనలో 10 మంది మహిళలు, 33 మంది మగవారు ఉన్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

మరో ఆరుగురు తీవ్ర గాయాలతో చావు బతుకు మధ్యన ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు