భారత సంతతికి చెందిన సర్టిఫైడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇన్‌ఫాలిబుల్ ఫార్మా. మార్కెట్‌లోకి మరింత చొచ్చుకుపోవడానికి, రూ.1000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.క్రిటికల్ కేర్ విభాగంలో ఫార్మా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా తన కార్యకలాపాలను ప్రారంభించిన ఇన్‌ఫాలిబుల్.
భారత్‌లో అగ్రశ్రేణి ఫార్మా కంపెనీగా తదనంతర కాలంలో పూర్తి స్థాయి ఫార్మాస్యూటికల్ కంపెనీగా అవతరించింది.
మనదేశంలో క్రిటికల్ కేర్ ఔషధాల ఉత్పత్తిలో ఇన్‌ఫాలిబుల్ ఫార్మా అగ్రగామిగా వుంది.
కోవిడ్ సమయంలో ఊహించని విధంగా దిగుమతులు నిలిచిపోవడంతో క్రిటికల్ కేర్ ఔషధాల కొరత ఏర్పడింది.అయితే ఇన్‌ఫాలిబుల్ ఫార్మా మాత్రం.
భారత్‌లోని అన్ని ఫార్మా కంపెనీల ఎమర్జెన్సీ కాల్స్‌ను రిసీవ్ చేసుకుంది.ఎలాంటి అంతరాయాలు లేకుండా అవసరమైన అన్ని మందులను సరఫరా చేసింది.
మహమ్మారి కాలంలో డిమాండ్ కారణంగా ఇన్‌ఫాలిబుల్ ఫార్మా గత ఆర్ధిక సంవత్సరం మంచి టర్నోవర్‌ను నమోదు చేసింది.
ఇన్‌ఫాలిబుల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ హరి ఓం మాట్లాడుతూ.
అవసరమైన మందులను సరఫరా చేయడం ద్వారా మానవాళికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.ఇన్‌ఫాలిబుల్ ఫార్మా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ విస్తరణకు శ్రీకారం చుట్టిందని హరిఓం చెప్పారు.రానున్న ఐదేళ్లలో రూ.1000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో ఉపయోగపడే హెపారిన్ సోడియం ఇంజెక్షన్ అండ్ ఎనోక్సాపరిన్ సోడియం ఇంజెక్షన్ (ప్రీఫిల్డ్ సిరంజిలు) ఉత్పత్తిలో ఇన్‌ఫాలిబుల్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.ఈ ప్రిస్క్రిప్షన్ డ్రగ్‌ని నెలకు 8 లక్షల 50 వేల వైల్స్‌కు పైగా మార్కెట్‌లో విక్రయిస్తోంది.ఇన్‌ఫాలిబుల్ ఫార్మాకు దేశంలోని అన్ని జిల్లాలు, ప్రధాన నగరాల్లో ఉనికి వున్నప్పటికీ.ఈ కంపెనీ ప్రధాన మార్కెట్ దక్షిణ, ఈశాన్య భారతంతో పాటు ఉత్తరప్రదేశ్‌లే.ఈ నేపథ్యంలో ఉత్తర, తూర్పు భారతదేశంలోని మార్కెట్‌లో పాగా వేసేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది.ఐసీయూ, మత్తునిచ్చే ఔషధాల ఉత్పత్తిని పెంచుకోవడంపై దృష్టి సారించింది.
ఇప్పటికే సంస్థకు 120 మంది మెడికల్ రిప్రజెంటేటివ్‌లు వుండగా.ఈ ఏడాది 250 మంది మెడికల్ రిప్రజెంటేటివ్‌లను రిక్రూట్ చేసుకోవాలని ఇన్‌ఫాలిబుల్ ఫార్మా లక్ష్యంగా పెట్టుకుంది.