చివరి రోజుకు చేరుకున్న ఇంద్రకీలాద్రి దేవి శరన్నవరాత్రులు..

విజయవాడ:ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రులు చివరి రోజు కు చేరుకున్నాయి.ఈరోజు రెండు అలంకరణలలో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ.

 Indrakeeladri Devi Sharannavaratri Celebrations Reaches Last Day , Indrakeeladri-TeluguStop.com

ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మహార్నవమి గడియల్లో శ్రీ మహిషాసుర మర్ధనీదేవి గా దర్శనమిస్తారు.శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసురమర్ధనికి ఎంతో విశిష్టత ఉంది.

రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.మద్యాహ్నం నుండి దశమి గడియల్లో అంటే విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరిదేవి గా దర్శనమిస్తారు.

సప్తశతి లో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకో పకారం చేసిన ఘట్టం వర్ణితమైంది.సింహావాహినిగా రూపొందిన శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురిడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, బాష్కులుడు, బిడాలుడు, వంటి రాక్షసులందరినీ సంహరించింది.

ఆ తర్వాత జరిగిన యుద్దం లో ఆ దేవి అవలీల గా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో కీలాద్రి పై స్వయంభువైంది.రౌద్రంలో ఉన్న అమ్మను శాంతిపచేసేందుకు ఇంద్రుడు తపస్సు చేసారు.

అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది.అమ్మవారి సహజస్వరూపం ఇదే.మహిషాసుర మర్ధనని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశిస్తాయని , సాత్విక భావం ఏర్పడుతుంది.సర్వదోషాలు పటాపంచలై ధైర్య , స్థైర్య , విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.

మహిషాసురమర్ధనిని దర్శించుకుంటే దసరా రోజు రాజరాజేశ్వరిని కూడా ద ర్శించుకోవాలనే నానుడి భక్తుల్లో ఇప్పటికీ నెలకొనిఉంది.మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుండి శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో దర్శన వివరణ దుర్గమ్మ.

విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.దేశ వ్యాప్తంగా విజయదశమి పండుగను భక్తులు జరుపుకుంటారు.

విజయదశమి కి ఎంతో విశిష్టత ఉంది.దసరా నాడు దర్శనం కోసం భక్తులు ఎంతో ఇష్టపడుతారు.

రాజరాజేశ్వరి దేవి గా అమ్మవారు సింహావాహనం పై ఆసీనురాలై ఉంటారు.షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరి, శ్రీచక్ర అధిష్టానదేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది.

విజయాన్ని సాధించిది కాబట్టి విజయ అని అంటారు.పరమశాంతి రూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడ చేతితో పట్టుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది.

రాజరాజేశ్వరీ దేవి ని సేవించడం వలన జీవితం ధన్యమవుతుందని , నవరాత్రుల పుణ్యపలం సకల శుభాలు, విజయాలు సిధ్దిస్తాయని భక్తుల విశ్వాసం.ఈ రోజు సాయంత్రం క్రిష్ణానదిలో ఉత్సవమూర్తులను పోలీసులు ఊరేగింపుగా దుర్గాఘాట్ కు తీసుకెళ్తారు.

గంగా పార్వతి సమేత మల్లేశ్వరుల స్వామివార్లు హంసవాహాణం పై నదివిహారం చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube