ఇటీవలే కాలంలో వివాహ బంధాల కంటే అక్రమ సంబంధాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.అక్రమ సంబంధాలను వివాహం కాని వారి కంటే వివాహం అయినవారే ఎక్కువగా కొనసాగిస్తున్నారు.
ఈ అక్రమ సంబంధాలు బయటపడితే చివరకు దారుణ హత్యలే జరుగుతాయి అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
వనపర్తి జిల్లాలోని పానగల్ మండలం షాఖాపూర్ గ్రామానికి చెందిన చిన్న రాములు( chinna ramulu )(35) తన భార్య కేశమ్మ అలియాస్ మహేశ్వరి( Maheshwari ) తో కలిసి అల్మాస్ గూడలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.చిన్న రాములు డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే జిల్లెల్లగూడకు చెందిన మంచాల రాము( manchala ramu ) అనే వ్యక్తితో మహేశ్వరి వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఈ విషయం భర్త చిన్న రాములుకు తెలియడంతో పలుమార్లు హెచ్చరించాడు.అయినా కూడా మహేశ్వరిలో మార్పు రాలేదు.ఈ విషయంలో తరచూ ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి.మహేశ్వరి మూడు రోజుల క్రితం భర్తతో గొడవ జరగడంతో పిల్లలతో కలిసి తన సొంత గ్రామానికి వెళ్లిపోయింది.ఈనెల 20వ తేదీ మహేశ్వరి తన ప్రియుడు రాముతో కలిసి భర్తను హత్య చేయాలని మాస్టర్ ప్లాన్ రచించింది.
ఇందుకోసం రాము తన స్నేహితుడైన తెల్ల పోగు దూలయ్య అనే వ్యక్తి సహాయం తీసుకున్నాడు.చిన్న రాములు రాత్రి గాడ నిద్రలో ఉన్న సమయంలో గొడ్డలితో గొంతు కోసి, తలపై విచక్షణారహితంగా కొట్టి చంపేశారు.
పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా మృతుడి భార్య మహేశ్వరుని విచారించగా వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్యా నేరాన్ని అంగీకరించింది.మహేశ్వరి తో పాటు రాము, దూలయ్యలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.







