ఈ విషయంలో అమెరికా కంటే ఇండియా చాలా లక్కీ... అంతా జియో పుణ్యమే

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఇంటర్నెట్‌ చుట్టు తిరుగుతుంది.ఇంటర్నెట్‌ రావడంతో ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రామం అయ్యింది.

రెండు దశాబ్దాల క్రితం అతి తక్కువ మందికి మాత్రమే పరిమితం అయిన ఇంటర్నెట్‌ పదేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది.ఇక ఎప్పుడైతే 4జీ యుగం ప్రారంభం అయ్యిందో అప్పటి నుండి మొత్తం పరిస్థితి మారిపోయింది.

కొన్నాళ్ల క్రితం వరకు ఇండియాలో ఇంటర్నెట్‌ వాడటం అంటే చాలా గొప్ప విషయం.కాని ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్‌ వాడేస్తూ ఉన్నారు.

ఇండియాలో ఇంటర్నెట్‌ ఇంతగా పెరగడానికి కారణం జియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక జియో రాకతో ఇండియా అత్యంత అరుదైన రికార్డును ప్రపంచ వ్యాప్తంగా నమోదు చేసింది.

Advertisement

జియో రాకముందు ఇండియన్స్‌ మొబైల్‌ నెట్‌ వాడాలి అంటే ఒక జీబీకి కనీసంగా 300 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది.కాని ఎప్పుడైతే జియో రంగప్రవేశం చేసిందో వెంటనే ఇతర మొబైల్‌ ఆపరేటింగ్‌ సంస్థలు కూడా తమ డేటా రేటుకు నాలుగు వంతు మేరకు తగ్గించాయి.జియో రాకతో ఇండియాలో ప్రస్తుతం 1 జీబీ డేటా సరాసరిగా రూ.18.50 పడుతుంది.ఇక ఇతర దేశాల్లో డేటా రేట్లను చూస్తే ఇండియాలో మనం ఉండటం చాలా లక్కీ అనిపిస్తుంది.

ఎందుకంటే అమెరికాలో 1 జీబీ మొబైల్‌ డేటా సరాసరిగా ఇండియన్‌ రూపీస్‌ ప్రకారం 868 రూపాయలు పడుతుంది.

కేవలం అమెరికాలో మాత్రమే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో మొబైల్‌ డేటా చాలా ఖరీదుగా ఉంది.ఎంతో అభివృద్ది చెందిన అమెరికాలో 1 జీబీ డేటా దాదాపు 900 రూపాయలుగా ఉండటం ఆశ్చర్యకర విషయం.ప్రపంచంలోనే అత్యంత రేటు కలిగిన డేటాగా అమెరికా డేటా ఉంది.

రేటు ఎక్కువ ఉన్నా కూడా మంచి స్పీడ్‌తో అక్కడ నెట్‌ సర్వీస్‌ ఉంటుంది.ఇక మరో అభివృద్ది చెందిన దేశం అయిన యూకే లో 1 జీబీ డేటా 467 రూపాయలుగా ఉంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మొబైల్‌ నెట్వర్కింగ్‌ సంస్థల రేట్లను పరిశీలించిన ప్రముఖ ప్రైస్‌ కంపేరిజన్‌ సైట్‌ ఈ వివరాలను వెళ్లడించింది.ఇక చైనాలో అత్యధికంగా స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ఉండగా, రెండవ స్థానంలో ఇండియా ఉంది.

Advertisement

అభివృద్ది చెందినట్లుగా చెప్పుకుంటున్న దేశాల కంటే ఇండియా ఈ విషయంలో చాలా ముందు ఉండటం ఆనందదాయం.ఇందుకు రిలయన్స్‌ వారి జియోకు, అంబానీ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.

తాజా వార్తలు