ఇండియాలో ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకుంటున్న విదేశీ విద్యార్ధులు, ఎన్ఆర్ఐ విద్యార్ధులకు ( foreign students, NRI students )భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఇందుకోసం రెండు స్పెషల్ కేటగిరీ వీసాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
‘ఈ- స్టూడెంట్ వీసా ’, ‘ ఈ- స్టూడెంట్ - x ’ వీసాలను హోం మంత్రిత్వ శాఖ తాజాగా ప్రవేశపెట్టింది.దరఖాస్తుదారులంతా ప్రభుత్వం ప్రారంభించిన స్టడీ ఇన్ ఇండియా (ఎస్ఐఐ) పోర్టల్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.
ఎస్ఐఐ పోర్టల్‌లో( SII portal ) నమోదు చేసుకున్న అర్హత గల విదేశీ విద్యార్ధులు ఈ స్టూడెంట్ వీసా సదుపాయాన్ని పొందొచ్చని అలాగే ఈ స్టూడెంట్ వీసాలు కలిగి ఉన్న వారిపై ఆధారపడిన వారిపై ఈ - స్టూడెంట్ - x వీసాను మంజూరు చేస్తామని వెల్లడించింది.ఎస్ఐఐ పోర్టల్‌ను భారత్‌లో దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక కోర్సులను అభ్యసించాలని అనుకునే అంతర్జాతీయ విద్యార్ధుల ప్రవేశ ప్రక్రియను సులభతరం చేస్తుంది.
విద్యార్ధులు https://indianvisaonline.gov.in/ పోర్టల్‌లో విడిగా దరఖాస్తు చేసుకోవాలి.కానీ వారి దరఖాస్తు ప్రామాణికతను ఎస్ఐఐ ఐడీ ( SII Id )ద్వారానే తనిఖీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.అందువల్ల అంతార్జాతీయ విద్యార్ధులు భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఎస్ఐఐ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.
భారత్‌లోని ఏదైనా ఎస్ఐఐ అనుబంధ ఇన్‌స్టిట్యూట్ / విద్యాసంస్థ నుంచి అడ్మిషన్ ఆఫర్ లెటర్‌ను అందుకున్న తర్వాత విద్యార్ధులు వీసా దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కోర్సు వ్యవధిని బట్టి విద్యార్ధి వీసాలు ( Student visas )ఐదేళ్ల వరకు జారీ చేయబడతాయి.అవసరం అనుకుంటే గడువు కాలాన్ని పొడిగించవచ్చని నిపుణులు తెలిపారు.చెల్లుబాటయ్యే ఈ- స్టూడెంట్ వీసాలు కలిగి ఉన్న వారు ఏ ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు నుంచైనా భారత్‌లోకి ప్రవేశించవచ్చని అధికారులు తెలిపారు.
అయితే భారత్‌లో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకునే ప్రతి విద్యార్ధికి ఎస్ఐఐ ఐడీ ఉండాలని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy