యూకేలో హిందూ ఆలయాలపై దాడులు : భారత్ సీరియస్... రంగంలోకి విదేశాంగ మంత్రి జైశంకర్

కొద్దిరోజుల క్రితం ఆసియా కప్‌లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించడంతో యూకేలోని లీసెస్టర్ సిటీలో పాక్‌కు చెందిన కొన్ని ముఠాలు హిందువులు నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి.ఆసియా కప్ 2022లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత ఆగస్ట్ 28న ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

 India's Foreign Minister S Jaishankar Takes Up Temple Attacks With Uk's Foreign-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రోజులు గడుస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో అల్లర్లు సద్దుమణగలేదు.

మరోవైపు యూకేలో హిందూ దేవాలయాలపై దాడులను భారత ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది.కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నేరుగా రంగంలోకి దిగారు.దీనిలో భాగంగా బ్రిటీష్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీని బుధవారం న్యూయార్క్‌లో కలుసుకున్నారు.ఈ సందర్భంగా యూకేలోని భారతీయ సమాజం భద్రత, సంక్షేమంపై జేమ్స్ దృష్టికి తీసుకెళ్లారు జైశంకర్.

దీనికి సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.భారత ఆందోళనలను యూకే విదేశాంగ మంత్రితో పంచుకున్నానని తెలిపారు.

మరోసారి దాడులు జరగడకుండా, నేరస్థులపై చర్యలు తీసుకోవడానికి యూకే ప్రభుత్వంతో అక్కడి భారత హైకమీషన్ సంప్రదింపులు జరుపుతోందని జైశంకర్ వెల్లడించారు.ఇకపోతే.

జేమ్స్‌తో భేటీ సందర్భంగా యూకే- ఇండియా రూట్ మ్యాప్ 2030, ఇండో – పసిఫిక్, ఉక్రెయిన్ యుద్ధం, భద్రతా మండలిలో భారత సభ్యత్వం తదితర విషయాలపైనా చర్చించినట్లు జైశంకర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Telugu India, Indiasforeign, Indo Pacific, Uk India, Uksforeign, Ukraine War-Tel

కాగా.శనివారం నాడు హిందూ దేవాలయంపై మతపరమైన జెండాను తొలగించిన నిందితులను కనుగొనలేకపోయామని లీసెస్టర్ పోలీసులు వెల్లడించారు.కానీ కేసులో పురోగతి సాధించినట్లు తెలిపారు.

మొత్తంగా ఈ ఘర్షణలకు సంబంధించి 47 మందిని అరెస్ట్ చేశామని లీసెస్టర్ పోలీసులు వెల్లడించారు.అటు లీసెస్టర్‌లో భారతీయ కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతున్న హింసను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ హైకమీషన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై యూకే అధికారులతో మాట్లాడుతున్నామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు హైకమీషన్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube