ఇంగ్లాండ్ కు క్యూ క‌డుతున్న భారతీయులు.. కార‌ణ‌మేంటంటే..?

ఒక‌ప్ప‌టి కంటే ఇప్పుడు మాన‌వుల జీవ‌న విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఉన్న చోటు నుంచి విదేశాల‌కు కూడా వ‌ల‌స వెళ్ల‌డం మ‌నం చూస్తున్నాం.

 Indians Queuing For England .. What Is The Reason ..?, England, Indians , Landon-TeluguStop.com

ఉన్న ప్రాంతంలో అనుకున్న‌న్ని వ‌స‌తులు లేక‌పోతే లేదంటే త‌మ‌కు అనుకూల‌మైన విధానాలు లేవ‌ని అనిపించినా స‌రే అవి ఎక్క‌డుంటే అక్క‌డ‌కు ప్ర‌యాణం అవుతున్నారు చాలామంది.ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు వారు కూడా త‌మ జీవ‌న విధానంలో మార్పులు కోరుకుంటున్నారు.

ఇందుకోసం భార‌తీయులు కూడా ఇలాగే ప‌య‌న‌మ‌వుతున్నారు.

ఇప్పుడు ఎక్కువ‌గా ఫెసిలిటీస్ అంటే చాలామంది అమెరికా, లండన్‌ల‌ను మాత్ర‌మే చూస్తున్నారు.

ఆయా దేశాల్లోనే సెటిల్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.ఎందుకంటే మ‌న దేశంలో కంటే ఆయా దేశాల్లో కరెన్సీ రేటు చాలా ఎక్కువ అని, అలాగే త‌మ‌కు అనుకూల విధానాలు ఉంటాయ‌నే భావ‌న‌తో భార‌తీయులు ఎక్కువ‌గా విదేశీ ప్ర‌యాణానికి మొగ్గు చూపుతున్నారు.

ఇక ఇంగ్లండ్ దేశం కూడా వీసా విషయంలో ఇప్ప‌టికే చాలా ఆఫర్లు ప్రకటిస్తోంది ఈ నేప‌థ్యంలో ఈ ఆఫ‌ర్ల‌ను ఎక్కువగా ఇండియన్స్ వాడుకుంటున్న‌ట్టు స‌మ‌చారం.

Telugu America, Britan, Currency Rates, England, Indians, Landon, Offers Visa-La

ఇందుకు మ‌రో కార‌ణం ఏంటంటే రీసెంట్ గా బ్రిటన్ అలాగే ఇండియా న‌డుమ ఒప్పందం జ‌ర‌గ‌డంతో దీన్ని ఆస‌రాగా చేసుకుని ఇండియ‌న్లు ఎక్కువ‌గా లండ‌న్ బాట ప‌డుతున్న‌ట్టు చెబుతున్నారు అధికారులు.ఇందులో మ‌రీ ముఖ్యంగా ఇండియాకు కు చెందిన ధనవంతులు బిజినెస్ ను విస్త‌రించే కార్య‌క్ర‌మంలో భాగంగా ఎక్కువ‌గా బ్రిటన్ వెళ్లేందుకే ఇష్ట‌ప‌డుతున్నారంట‌.మిగతా కంట్రీల‌తో పోలిస్తే గ‌న‌క ఇంగ్లండ్ కు మ‌న దేశం నుంచి వెళ్లే వారికి కొన్ని అనుకూల నిబంధ‌న‌లు ఉండ‌టంతో అంద‌రూ ఇటువైపు చూస్తున్నార‌ని తెలుస్తోంది.

దీంతో అత్య‌ధికంగా ఇప్పుడు బ్రిట‌న్ వైపు మ‌న ఇండియా నుంచి ఫ్లైట్లు న‌డుస్తున్నాయ‌ని చెబుతున్నారు అధికారులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube