కరోనా ధాటికి దేశాలకి దేశాలు బిక్క చచ్చిపోయాయి.ఒక పక్క ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోవడమే కాకుండా ఆర్ధిక మాంద్యంతో అల్లాడిపోతున్నాయి.
దాంతో ఆయా దేశాలు సంస్కరణలు మొదలు పెడుతున్నాయి.కరోనాని జయించడమే కాకుండా కరోనా కారణంగా అతలాకుతలం అయిన ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి.
కరోనా కారణంగా అంతర్జాతీయ విమానయాన సర్వీసులని నిలిపివేసిన దేశాలు ఆ రంగంలో కుదేలయ్యిపోయాయి దాంతో ఎంతో మంది ఉద్యోగులు ఉపాది కూడా కోల్పోయారు కూడా.ఈ క్రమంలోనే కువైట్ విమానయాన రంగంపై కరోనా ప్రభావం తీవ్ర రూపం దాల్చడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
ఆర్ధికంగా కుంగిపోయిన సంస్థలని గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టిన కువైట్ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటోంది.విమానయాన సర్వీసులు ప్రారంభించినట్టుగా ప్రకటించిన కువైట్ కొన్ని షరతులు కూడా విధించింది.
ఆగస్టు 1 వ తేదీ నుంచీ విమానయాన సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించుకున్న కువైట్ ప్రభుత్వం కువైట్ లో ఉంటున్న వారికి, అలాగే కువైట్ ప్రజలకు రాకపోకలకి మాత్రమే అనుమతిని ఇచ్చింది.కరోనా నేపధ్యంలో కేవలం వారికి మాత్రమే ప్రస్తుతానికి అనుమతులు ఇచ్చామని తెలిపింది.అయితే

భారతీయులకి మాత్రం కువైట్ లోకి రావడానికి అనుమతించడం లేదని తెలిపింది.కేవలం భారతీయులు మాత్రమే కాకుండా శ్రీలంక, ఫిలిప్పైన్స్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇరాన్, నేపాల్, వంటి దేశాల నుంచీ వచ్చే వారికి కూడా తమ దేశంలో అడుగు పెట్టడానికి అనుమతులు ఇవ్వడం లేదని తెలిపింది.అయితే ఆయా దేశాలలో కరోనా వ్యాధి అత్యధికంగా ఉండటంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.