సాయ్ ట్రయిల్స్ కి నో చెప్పిన ఇండియన్ ఉసేన్ బోల్ట్

కర్ణాటకలోని మంగళూరులో ఇటీవల జరిగిన కంబాళ పోటీల్లో 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.

62 సెకన్లలో పూర్తి చేసిన శ్రీనివాస గౌడ ఒక్కసారిగా దేశంలో అందరి దృష్టిని ఆకర్షించాడు.అలాంటి వాళ్ళని ఇండియా తరుపున ఒలింపిక్స్ కి పంపించాలని చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

ఇక వాటిపై స్పందించి కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు ముందుకొచ్చారు.అతనికి ఒకసారి ట్రయిల్స్ నిర్వహించాల్సిందిగా స్పోర్ట్స్ అథారిటీకి ఆదేహ్సాలు జారీ చేశారు.జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ రికార్డ్ ని బ్రేక్ చేసిన శ్రీనివాస గౌడకి ట్రయిల్స్ నిర్వహించడానికి సాయ్ ముందుకొచ్చింది.

అయితే శ్రీనివాస మాత్రం సాయ్ కి ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు.తాను ట్రయల్స్‌లో పోటీపడనని తేల్చి చెప్పేసినట్లు వార్తలు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.

ఓ మీడియా సంస్థతో మాట్లాడిన శ్రీనివాస్ గౌడ కంబాళ రేసులో నా కాలి మడమ సాయంతో వేగంగా పరుగెత్తగలను.కానీ ట్రయల్స్‌లో సింథటిక్ ట్రాక్‌పై స్పోర్ట్స్ షూస్ తో పరిగెత్తడం అంటే కాస్తా కష్టంతో కూడుకున్నది.

Advertisement

ఇంకా చెప్పాలంటే కంబాళ పోటీలో జాకీకి దున్నల నుంచి కూడా సపోర్ట్ లభిస్తుంది.ట్రాక్‌పై తనకి ఎలాంటి సపోర్ట్ ఉండదు.

అందుకే నేను ట్రయల్స్‌లో పోటీపడను.కంబాళపైనే దృష్టి సారిస్తాను అని చెప్పినట్లు సమాచారం.

అయితే ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే సాయ్ ఈ విషయంపై అఫీషియల్ గా ప్రకటన చేసేంత వరకు తెలియదు.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?
Advertisement

తాజా వార్తలు