దేశ విదేశాలలో భారతీయుల ప్రతిభ ఎన్నో సందర్భాలలో రుజువయ్యింది.అగ్ర రాజ్యం అమెరికా అయితే భారతీయుల ప్రతిభకు సాహో అంటుంది కూడా.
ఇప్పటికే అమెరికాలో ఎంతో మంది భారతీయులు పలు విభాగాలలో కీలక స్థానాలలో కొలువై ఉన్నారు.ముఖ్యంగా తెలుగు వారు అమెరికాలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించారు.
విద్యా, శాస్త్ర సాంకేతిక, వ్యాపార రంగాలలో తెలుగు వారు తిరుగులేని సత్తా చాటుతున్నారు.తాజాగా అమెరికా అంతరక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్వహించిన బ్రేక్ ది ఐస్ లూనార్ ఛాలెంజ్ లో తెలుగు విద్యార్ధులు తమ సత్తా చాటారు.
దాంతో ఇప్పుడు వారు నాసాలో పనిచేసే అవకాశాన్ని సంపాదించారు .వివరాలలోకి వెళ్తే.
నాసా “బ్రేక్ ది ఐస్ లూనార్ ఛాలెంజ్” కు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 48 దేశాల నుంచీ దాదాపు 380 బృందాలు పాల్గొన్నాయి.నాసా నియంమం ప్రకారం ఈ బృందాలు అన్నిటిలో 10 బృందాలను సెలక్ట్ చేయాలి.
అంటే ఏ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని నాసా ఎంచుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఈ 10 బృందాలలో తెలుగు యువకులు కూడా సత్తా చాటారు.అంతేకాదు నాసాతో రెండేళ్ళ పాటు పనిచేసే అవకాసం తో పాటు 25వేల డాలర్ల నగదు బహిమతి కూడా అందుకున్నారు.

తెలుగు కుర్రాళ్ళు ఏఏ టీమ్ పేరుతో ఏర్పడిన ఈ బృందంలో ఒకరు అమెరికాలో స్థిరపడిన ఎన్నారై విద్యార్ధి ప్రణవ్ ప్రసాద్ ఉండగా, మరొకరు తెనాలి నుంచీ అమరేశ్వర ప్రసాద్, విశాఖ నుంచీ కారణం సాయి ఉన్నారు.ఈ ముగ్గురు కలిసి ప్రస్తుతం నాసాలో పనిచేయనున్నారు.ఇంతకీ ఏమిటీ ప్రాజెక్ట్ అంటే చంద్రుడి ఉపరితలం పై తవ్వి లోపల ఉన్న మంచును బయటకు తీయడం.
నాసా ఇచ్చిన ఈ టార్గెట్ ను ఈ ముగ్గురు యువకులు తమదైన శైలిలో నూతన ఆవిష్కరణలు జోడించి అద్భుతమైన ప్రదర్సన ఇచ్చారు దాంతో వీరిని నాసా తమతో పనిచేసేందుకు ఎంపిక చేసింది.ఇదిలాఉంటే ఈ టీమ్ లో ఉన్న ప్రణవ్ ప్రసాద్ అమెరికాలో స్థిరపడిన ఎన్నారై విద్యార్ధి.
ఈ టీమ్ కు ప్రణవ్ ప్రసాద్ నేతృత్వం వహించినట్టుగా తెలుస్తోంది.