ఆస్ట్రేలియాలో( Australia ) జరిగిన ఓ దాడిలో గాయపడ్డ భారతీయ విద్యార్ధి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు.బాధితుడు టాస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్న వ్యక్తిగా గుర్తించారు.నవంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 4.20 గంటలకు టాస్మానియాలోని ఓ ఆవరణలో అతనిపై దాడి జరిగింది.హుటాహుటిన అతనిని రాయల్ హోబర్డ్( Royal Hobard ) ఆసుపత్రికి తరలించినట్లు సిడ్నీకి చెందిన బ్రాడ్‌కాస్టర్ ఎస్‌బీఎస్ నివేదించింది.ఈ ఘటనలో అతని కుడివైపు ఊపిరితిత్తులు దెబ్బతినగా.
మెదడుకు సైతం శస్త్రచికిత్స చేశారు.ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులు 25 ఏళ్ల బెంజమిన్ డాడ్జ్ కాలింగ్స్‌ను ( Benjamin Dodge Callings )అదుపులోకి తీసుకుని పలు అభియోగాలు మోపారు.
ఈ నేరానికి గాను బెంజమిన్‌కు గరిష్టంగా 21 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు తెలిపారు.
కాలింగ్స్‌కు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేస్తూ.డిసెంబర్ 4న కోర్టు ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.ఈ ఘటన జాతి వివక్షతో జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై స్థానికుడు జర్మన్‌జిత్ సింగ్ గిల్ ఆవేదన వ్యక్తం చేశారు.అభియోగాలు మోపబడిన వ్యక్తి బెయిల్‌పై విడుదలైతే.పేదవాడు తన ప్రాణాల కోసం పోరాడుతున్నాడని ఆయన ఫేస్‌బుక్ గ్రూప్.ఇండియన్స్ ఇన్ టాస్మానియాలో( Indians in Tasmania ) పోస్ట్ చేశారు.
బాధితుడికి సహాయం చేయడానికి కమ్యూనిటీ మద్ధతును కోరతామని గిల్ పేర్కొన్నాడు.
అస్సాంలో వున్న బాధితుడి కుటుంబానికి ఆస్ట్రేలియా వచ్చేందుకు పాస్‌పోర్టులు లేవని అతని స్నేహితులు తెలిపారు.యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా( University of Tasmania ) మీడియా డైరెక్టర్ .బాధితుడి కుటుంబంతో నిరంతరం టచ్‌లో వున్నారని ఎస్‌బీఎస్ హిందీ నివేదించింది.అనువాదకులు, వసతి, ఇతర మద్ధతుతో పాటు కేసుకు మేనేజర్‌ను కేటాయించారని పేర్కొంది.అయితే బాధితుడు ఎవరు.ఎన్నాళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చాడు.దాడి చేసిన వ్యక్తి పరిస్ధితి ఏంటన్న దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.