అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ విద్యార్ధి ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టామిట్టాడుతున్నాడు.వివరాల్లోకి వెళితే.
ఈ నెల ప్రారంభంలో న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితుడి మెదడుకు గాయమవ్వగా.పక్కటెముకలు సైతం విరిగిపోయాయి.
న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న వినమ్ర శర్మ నవంబర్ 12న యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదానికి గురయ్యాడు.
దీంతో స్థానికులు అతనిని రట్జర్స్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారు.
వైద్య పరీక్షల్లో వినమ్ర శర్మ మెదడుకు గాయమైందని తేలింది.ఈ క్రమంలో అతనికి మద్ధతుగా ‘‘గో ఫండ్ మీ’’ పేజీని తెరిచారు.
వెంటిలేటర్ పై చికిత్సను నిలిపివేసినప్పటికీ, గత వారంలో నిర్వహించిన నాలుగు శస్త్ర చికిత్సల కారణంగా శర్మ మెదడు వాపుతో బాధపడుతున్నట్లు అభిషేక్ అనే వ్యక్తి తెలిపారు.

ప్రస్తుతం భారత్‌లో వున్న వినమ్ర శర్మ తల్లిదండ్రులు అమెరికా వీసా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.శర్మకు అమెరికాలో వున్న ఆరోగ్య బీమా.అతని ప్రమాద ఖర్చులను కవర్ చేయదని తెలుస్తోంది.
వినమ్ర శర్మ ఆసుపత్రి ఖర్చులలో డాక్టర్, సర్జన్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్‌లు, ఐసీయూ సేవలు, వైద్య పరీక్షలు, ఇతర ఆసుపత్రి ఫీజులు వున్నాయి.ఇప్పటి వరకు 72,199 డాలర్లను క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించినట్లుగా తెలుస్తోంది.
ఇది నేరుగా విద్యార్ధి కుటుంబానికి బదిలీ చేయబడుతుంది.
