Jr Ntr: తినడం తాతయ్యని చూసి నేర్చుకున్నా.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నందమూరి వారసుడుగా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి హీరో ఎన్టీఆర్ గురించి పరిచయం అవసరం లేదు.ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందారు.

 Ntr Food Habbits From Senior Ntr Full Details, Junior Ntr, Senior Ntr, Ntr Food-TeluguStop.com

ఇకపోతే గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ తన ఫుడ్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి.ఎన్టీఆర్ ప్రస్తుతం స్లిమ్ గా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో అధిక శరీరం బరువు కలిగి ఉండేవారు.

ఈ క్రమంలోనే తాను ఫుడీ అనే విషయాన్ని ఎన్టీఆర్ చెబుతూనే ఇలా తినడం తన తాతయ్యని చూసి నేర్చుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాతగారు ఆహారపు అలవాట్లు తనకి వచ్చాయని తెలిపారు.

తాతగారు మంచి భోజన ప్రియులు నన్ను కూడా అలాగే తయారు చేశారని ఎన్టీఆర్ తెలియజేశారు.బావార్చి బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ నలుగురు తినగలిగేది నేను ఒక్కడినే తినేవాడ్ని ఎంతోమంది జాగింగ్ చేసి వర్కౌట్ చేయమని చెప్పినా పెద్దగా పట్టించుకునే వాడిని కాదు.

Telugu Habits, Jr Ntr, Jr Ntr Diet, Ntr, Nandamuritaraka, Ntr Habbits, Senior Nt

ఇలా శరీరాకృతిపై ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ఉండటం వల్ల అధిక శరీర బరువు పెరిగానని అయితే రాఖీ సినిమాలో స్క్రీన్ పై నన్ను నేను చూసుకున్నప్పుడు నాకే ఆ పాత్ర సంతృప్తి కలగలేదు అందుకే ఎలాగైనా శరీర బరువు తగ్గాలని నిర్ణయించుకున్నానని తారక్ తెలిపారు.ఇకపోతే ఇప్పటికీ కూడా అదే ఫుడ్ తినగలను కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలందరూ కూడా తమ శరీరాకృతిపై దృష్టి పెట్టి ఎంతో ఫిట్ గా ఉంటున్నారు.అందుకే తాను కూడా అన్ని విషయాలలో జాగ్రత్త పడుతున్నారని ఈ సందర్భంగా ఎన్టీఆర్ గతంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube