అమెరికాలో ఇల్లు కొన్న భారత సంతతి ట్రక్ డ్రైవర్ .. ఎంతో తెలుసా, నోరెళ్లబెడుతోన్న నెటిజన్లు

సొంత ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.ఎవరి స్థోమతకు తగ్గట్టుగా చిన్నదో , పెద్దదో ఇల్లు ఉండాలని .

అందులో ఫలానా సౌకర్యం కల్పించాలని కలలు కంటూ ఉంటారు.ఎంతో శ్రమించి పైసా పైసా కూడబెట్టి సొంతింటి కలను సాకారం చేసుకుంటూ ఉంటారు.

అయితే పెరిగిపోయిన ధరలతో పేద, మధ్యతరగతి వర్గాలకు సొంతింటి కల అందని ద్రాక్షగా మారుతోంది.ఒక్క భారతదేశంలోనే కాదు.ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్ధితి.

అలాంటిది ఒక భారతీయుడు దేశం కానీ దేశమైన అమెరికాకు వలస వెళ్లి అక్కడ ఇల్లు కొనడమంటే మామూలు విషయం కాదు.ప్రస్తుతం అమెరికా ఆర్ధిక పరిస్ధితి ఏమాత్రం బాలేదు.

Advertisement
Indian-origin Truck Driver Buys 5-bedroom House Worth Rs 2 Crore In US, Indian-o

అధిక ధరలు, వడ్డీ రేట్లను పరిగణనలోనికి తీసుకుంటే .అద్దెకు ఉండే వ్యక్తులకు అక్కడ సొంతిల్లు అనేది పగటి కల లాంటిదని నిపుణులు చెబుతున్నారు.అయితే ఒక భారతీయ ట్రక్ డ్రైవర్ (Indian-origin Truck Driver)దానిని సాధించి చూపించాడు.

AvgIndian Observer అనే ఎక్స్ హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

Indian-origin Truck Driver Buys 5-bedroom House Worth Rs 2 Crore In Us, Indian-o

ఈ ట్వీట్‌లో సదరు ట్రక్ డ్రైవర్ కొత్తగా కొనుగోలు చేసిన ఇంటి ముందు నిలబడి ఉన్నాడు.పట్టణ శివార్లలో ఉన్న ఈ ఇల్లు ఐదు బెడ్‌రూమ్‌లను కలిగి ఉండగా.భారతీయ కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ.2 కోట్లు.నిజానికి ఈ వార్త ఇప్పటిది కాదు.

గతేడాది ట్రావెల్ వ్లాగర్ ఒకరు ఈ విషయాన్ని పంచుకున్నారు.అయితే ఇంటర్నెట్‌లో ఇది మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చి , వైరల్ అవుతోంది.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
కెనడా శుభవార్త.. కొత్త వీసా కేటగిరీలోకి ఆ కార్మికులు

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.అమెరికాలో గృహ నిర్మాణంపై పెద్ద చర్చకు దిగిన వారు.

Advertisement

భారతదేశంలో కంటే యూఎస్‌లో ఇంటిని కొనుగోలు చేయడం సులభమా అని ప్రశ్నిస్తున్నారు.అలాగే అమెరికాలో సగటు ట్రక్ డ్రైవర్ ఈ స్థాయిలో సంపాదిస్తున్నాడా అని నోరెళ్లబెడుతున్నారు.

అమెరికాలో చెక్క ఇళ్లు అని.భారతదేశంలో మాదిరిగా ఇటుకలు, కాంక్రీట్‌‌తో నిర్మించినవి కాదని .అవి కేవలం 4 నుంచి 5 నెలల్లో నిర్మితమవుతాయని ఓ యూజర్ రాసుకొచ్చాడు.అమెరికాలో ఎక్కువ భూమి, తక్కువ ప్రజలు ఉన్నారని అతను తెలిపారు.

అయితే ఆ ఇల్లు కొన్న ట్రక్ డ్రైవర్ పేరు, తదితర వివరాలను అందులో పంచుకోలేదు.

తాజా వార్తలు