సింగపూర్: నా సభ్యత్వం రద్దు చేస్తారా .. సొంత పార్టీపై కోర్టుకెక్కనున్న భారత సంతతి నాయకురాలు

2019 జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన సభ్యత్వాన్ని రద్దు చేయడంపై భారత సంతతికి చెందిన సింగపూర్ రాజకీయ నాయకురాలు తన సొంత పార్టీపై కోర్టులో దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు.54 ఏళ్ల కళా మాణిక్కం.

ప్రోగ్రెస్ సింగపూర్ పార్టీ (పీఎస్‌పీ)లో కీలక నేతగా వ్యవహరించారు.

వయోజన విద్యావేత్తగా, మాజీ సైనికాధికారిగా పనిచేసిన కళ తదనంతరం రాజకీయాలలో ప్రవేశించారు.డిసెంబర్ 2020లో తన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తప్పుడు విధానాలతో తన సభ్యత్వాన్ని రద్దు చేశారని, పీఎస్‌పీపై చర్యలు కోరుతూ కోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు ది స్ట్రైయిట్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.అంతేకాదు ఎన్నికల ప్రచారానికి గాను కరపత్రాలను ముద్రించడంతో పాటు ఇతర వ్యయాల కోసం తాను ఖర్చు చేసిన 10,000 సింగపూర్ డాలర్లను తిరిగి చెల్లించాలని కూడా కళ కోరుతున్నారు.

పీఎస్‌పీ సభ్యులు దాఖలు చేసిన ఏడు అఫిడవిట్‌లలో ఒకదానిపై పార్టీ చీఫ్ ఫ్రాన్సిస్ యుయెన్ స్పందించారు.కళా అంటున్న 10,000 డాలర్ల క్లెయిమ్‌కు ఎలాంటి ఆధారం లేదన్నారు.

Advertisement

పార్టీ రాజ్యాంగం ప్రకారం.సభ్యుల మధ్య తలెత్తే వివాదాలను ప్రత్యేక పార్టీ సమావేశంలో చర్చించాల్సి వుంటుంది.

కానీ తన విషయంలో ఎలాంటి సదస్సును ఏర్పాటు చేయలేదని కాలా అంటున్నారు.అయితే ఈ ఏడాది మార్చి 28న జరిగిన పీఎస్‌పీ సమావేశంలో 71 మంది కేడర్ సభ్యులకు గాను 66 మంది పాల్గొన్నారు.

అయితే మెజారిటీ సభ్యులు మాత్రం ఆమె విజ్ఞప్తిని తిరస్కరిస్తూ ఓటు వేశారు.

కాగా.పీఎస్‌పీ పార్టీ ప్రస్తుతం సింగపూర్‌లో ప్రతిపక్షంలో వుంది. పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ), వర్కర్స్ పార్టీ (డబ్ల్యూపీ)ల తర్వాత మూడో పార్టీగా సింగపూర్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

పీపుల్స్ యాక్షన్ పార్టీ మాజీ ఎంపీ టాన్ చెంగ్ బాక్ మరో 11 మంది ఇతర సభ్యులు 2019లో ఈ పార్టీని స్థాపించారు.సింగపూర్ రిజిస్ట్రీ ఆఫ్ సొసైటీస్ నుంచి ఆమోదం పొందిన తర్వాత పార్టీ అధికారికంగా 2019 మార్చి 28న నమోదు చేయబడింది.పారదర్శకత, స్వాతంత్ర్యం, జవాబుదారీతనం, సుపరిపాలన మూల సిద్ధాంతాలుగా తమ పార్టీ పనిచేస్తుందని టాన్ చెంగ్ బాక్ వివరించారు.2020 సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ వెస్ట్ కోస్ట్ జీఆర్‌సీలో 48 శాతం ఓట్లను సంపాదించింది.అలాగే సింగపూర్ 14వ పార్లమెంట్‌లో రెండు ఎన్‌సీఎంపీ సీట్లను క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కల్పించింది.

Advertisement

తాజా వార్తలు