న్యూయార్క్ పోలీస్ శాఖలో చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళా అధికారి..!!

భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి కెప్టెన్ ప్రతిమా భుల్లార్ మాల్డోనాడో( Pratima Bhullar Maldonado ) చరిత్ర సృష్టించారు.

న్యూయార్క్ పోలీస్ శాఖలో( NYPD ) అత్యున్నత ర్యాంక్ పొందిన దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కారు.

క్వీన్స్‌లోని రిచ్‌మండ్ హిల్‌లో వున్న 102వ పోలీస్ స్టేషన్‌కు ప్రతిమ ఇన్‌ఛార్జ్.ఆమె గత నెలలో కెప్టెన్‌గా ప్రమోషన్ పొందారు.

నలుగురు పిల్లల తల్లి అయిన ప్రతిమ భారత్‌లోని పంజాబ్‌లో జన్మించారు.తన 9 ఏళ్ల వయసులో ఆమె న్యూయార్క్‌లోని క్వీన్స్‌కు వెళ్లారు.

కాగా.ప్రతిమ వుంటున్న సౌత్ రిచ్‌మండ్ హిల్( South Richmond Hill ) అమెరికాలోని అతిపెద్ద సిక్కు కమ్యూనిటీలలో ఒకటి.

Advertisement

ఈ సందర్భంగా ప్రతిమ మీడియాతో మాట్లాడుతూ.ఇక్కడ భాషాపరమైన అవరోధాలు వున్నాయన్నారు.అలా ఇబ్బందులు పడుతున్న వారిని తాను ప్రత్యక్షంగా చూశానని ప్రతిమ చెప్పారు.

అమెరికా పోలీస్ శాఖలో మహిళలు, అందులోనూ దక్షిణాసియా సంతతి వారు ర్యాంక్‌లను పొందడం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని 33,787 మంది సభ్యులలో 10.5 శాతం మంది ఆసియా మూలాలున్న వారే కావడం గమనార్హం.న్యూయార్క్ నగరం ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్ హెరిటేజ్ మాసాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రతిమ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.

ఇకపోతే.గత నెలలో మన్మీత్ కౌర్ అనే భారత సంతతి మహిళ అమెరికా పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ చీఫ్‌గా బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే.ఈమె స్వగ్రామం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా భుల్లేచక్ గ్రామం.

మన్మీత్ సాధించిన ఘనతతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా మన్మీత్ కౌర్ తండ్రి కుల్వంత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

తాను భారత నౌకాదళంలో పనిచేశానని, ఈ క్రమంలోనే తన కుమార్తె సైతం చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని నిర్ణయించుకుందని చెప్పారు.ముఖ్యంగా మన్మీత్‌కు పిస్టల్స్ అంటే చాలా ఇష్టమని.

Advertisement

కెరీర్ పట్ల ఆమెకు వున్న ఇష్టమే అమెరికాలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ స్థాయికి చేరేలా చేసిందన్నారు.చదువులో ఎంతో చురుగ్గా వుండే మన్మీత్.

అప్పటికే ఎఫ్‌బీఐలో పనిచేసిన బంధువులతో ప్రభావితమైందని చెప్పారు.

తాజా వార్తలు