సింగపూర్‌లో 81 ఏళ్ల భారత సంతతి రచయిత్రి మీరాచంద్( Meira Chand )కు అత్యున్నత పురస్కారం ‘‘ Cultural Medallion’’ దక్కింది.ఆమెతో పాటు మరో ఇద్దరు సింగపూర్ జాతీయులు కూడా ఈ పురస్కారం అందుకున్నారు.
కళాత్మక నైపుణ్యం, కళలు, సాంస్కృతిక రంగాన్ని సుసంపన్నం చేయడంలో చేసిన కృషికి గాను సింగపూర్ ప్రభుత్వం వీరిని ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది.మంగళవారం ఇస్తానాలో జరిగిన కార్యక్రమంలో మీరాచంద్, సుచేన్ క్రిస్టీన్ లిమ్, మలయ్ డ్యాన్స్ దిగ్గజం ఉస్మాన్ అబ్ధుల్ హమీద్(Osman Abdul Hamid )లు సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారని ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.

1997లో హో మిన్ఫాంగ్ తర్వాత ఈ అవార్డును అందుకున్న తొలి ఆంగ్ల భాషా రచయిత్రిగా లిమ్తో పాటు స్విస్ – భారత సంతతికి చెందిన మీరాచంద్లు నిలిచారు.మీరా చంద్ గతంలో రాసిన ‘‘ది పెయింటెడ్ కేజ్( The Painted Cage ) ’’ ప్రతిష్టాత్మక 1986లో బుకర్ ప్రైజ్ రేసులో నిలిచింది.ఆమె వెబ్సైట్ ప్రకారం స్విస్ తల్లి, భారతీయ తండ్రికి మీరాచంద్ జన్మించారు.లండన్( London )లోనే ఆమె బాల్యం, విద్యాభ్యాసం గడిచింది.1962లో ఆమె తన భర్త (భారతీయుడు)తో కలిసి జపాన్‌కు వెళ్లారు.అక్కడి ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో కళపై విద్యాభోదన చేశారు.1971లో జపాన్ నుంచి భారత్‌కు వచ్చిన మీరా చంద్.ముంబైలో ఐదేళ్ల పాటు జీవించారు.
ఆ కాలంలోనే ఆమె తొలిసారిగా కలం పట్టారు.భారత్‌లో వున్న సమయంలో జీవితాన్ని మార్చే అనుభవం ఎదురైందని మీరా చంద్ అన్నారు.

దివంగత సింగపూర్ అధ్యక్షుడు, అప్పటి సాంస్కృతిక మంత్రి ఓంగ్ టెంగ్ చియోంగ్ 1979లో ‘‘కల్చరల్ మెడిలియన్( Cultural Medallion ) అవార్డును నెలకొల్పారు.సింగపూర్ కళలు, సాంస్కృతిక రంగాన్ని సుసంపన్నం చేసిన కళాత్మక నైపుణ్యం, సహకారం, నిబద్ధత కలిగిన వ్యక్తులకు ఈ పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారని నేషనల్ ఆర్ట్స్ కౌన్సిల్ వెబ్సైట్ చెబుతోంది.సినిమా, సాహిత్య కళలు, ప్రదర్శన కళలు, దృశ్య కళల రంగాల్లో దాదాపు 132 మంది కళాకారులకు ఇప్పటి వరకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు తెలిపింది.గతేడాది 56 ఏళ్ల తమిళ హిందూ అరవింత్ కుమారస్వామి( Aravinth Kumarasamy )కి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.







