హిందువులు పరమ పవిత్రంగా భావించే స్వస్తిక్ గుర్తుకు.నాజీల ద్వేషానికి చిహ్నమైన ‘హకెన్ క్రూజ్’లు ఒకటే అన్నట్లుగా ప్రవర్తిస్తున్న కెనడా సర్కార్ తీరుపై అక్కడి హిందూ సమాజం మండిపడింది.
ఈ నేపథ్యంలో ఈ రెండు గుర్తుల మధ్య తేడాను గమనించాలని కెనడా ప్రజలను, ఆ దేశ ప్రభుత్వాన్ని భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య విజ్ఞప్తి చేశారు.
‘‘ అనేక మత విశ్వాసాలను పాటిస్తున్న పది మిలియన్ల మంది కెనడియన్లు, ప్రత్యేకించి హిందూ కెనడీయన్లను ఉద్దేశించి ఒక హిందూ కెనడియన్‌గా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.
హిందూ మత పవిత్ర చిహ్నం స్వస్తిక, నాజీ ద్వేషానికి చిహ్నమైన హకెన్ క్రూజ్‌ల మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాల్సిందిగా కోరుతున్నా.నాజీ చిహ్నాన్ని జర్మన్‌లో హకెన్ క్రూజ్ అని ఆంగ్లంలో హుక్డ్ క్రాస్ అని పిలుస్తారు’’ అంటూ చంద్ర ఆర్య తెలిపారు.
గత వారం కెనడియన్ పార్లమెంట్‌లో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.ప్రాచీన భారతీయ భాష అయిన సంస్కృతంలో స్వస్తిక అంటే ‘‘అదృష్టాన్ని, శ్రేయస్సును తెస్తుంది’’ అన్న అర్ధమని చంద్ర ఆర్య చెప్పారు.
ఈ పవిత్ర చిహ్నాన్ని ఆలయాలు, మతపరమైన సాంస్కృతిక ఆచారాలలో, గృహ ప్రవేశాలలో, దైనందిన జీవితంలో నేటికీ ఉపయోగించబడుతోందని ఆయన గుర్తుచేశారు.అంతటి విశిష్టత వున్న స్వస్తిక్‌ను ద్వేషానికి చిహ్నమైన నాజీల హకెన్ క్రూజ్ ఒకటే అన్నట్లుగా పరిగణించొద్దని చంద్ర ఆర్య విజ్ఞప్తి చేశారు.

దీనిని హిందూ అమెరికన్లు స్వాగతించారు.‘‘స్వస్తిక్’’ గుర్తును నాజీ విద్వేషానికి చిహ్నమైన ‘‘హకెన్‌క్రూజ్’తో కలిపి చూడొద్దని అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హిందూపాక్ట్ (హిందూ పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ కలెక్టివ్) కోరింది.2020 నుంచి తమ స్వస్తిక ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో బౌద్ధులు, జైనులు, యూదులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ వచ్చామని తెలిపింది.