భార్య దారుణ హత్య: యూకేలో భారతీయుడికి జీవిత ఖైదు

మాజీ భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపిన భారత సంతతి వ్యక్తికి యూకే కోర్టు జీవితఖైదు విధించింది.

ఈ ఏడాది మార్చిలో లీసెస్టర్ నగరంలోని ఇంటి వద్దే కత్తి పోట్లకు గురైన 21 ఏళ్ల భావిని ప్రవీణ్ హత్య కేసులో జిగుకుమార్ సోర్తికి కోర్టు బుధవారం శిక్షను ఖరారు చేసింది.

తీర్పు సందర్భంగా లీసెస్టర్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ తిమోతి స్పెన్సర్ మాట్లాడుతూ.దీనిని భయంకరమైన, క్రూరమైన చర్యగా అభివర్ణించారు.

కేవలం 21 సంవత్సరాల చిన్న వయసులో వున్న అందమైన, ప్రతిభావంతురాలైన యువతి ప్రాణాలను కనికరం లేకుండా తీశారని ఆయన వ్యాఖ్యానించారు.కేసు పూర్వాపరాల్లోకి వెళితే.మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జిగుకుమార్ సోర్తి బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు.ఆ తర్వాత కత్తితో భావినిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఆమెను హత్య చేసిన రెండు గంటల తర్వాత

జిగుకుమార్

నేరుగా లీసెస్టర్‌లోని స్పిన్నే హిల్ పోలీస్‌‌స్టేషన్‌ అధికారిని సంప్రదించి భావిని ప్రవీణ్‌ను హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయాడు.అతను చెప్పిన మాటతో షాక్‌కు గురైన పోలీసులు కొద్దిసేపటి తర్వాత చేరుకుని ఘటనాస్థలికి బయల్దేరారు.

Advertisement

పోస్ట్‌మార్టం నివేదికలో భావినీ ప్రవీణ్‌ పదుల సంఖ్యలో కత్తిపోట్ల కారణంగానే మరణించినట్లు తేలింది.జిగుకుమార్ సోర్తికి భావినీ ప్రవీణ్‌కు 2017లో భారత్‌లో అతికొద్దిమంది సమక్షంలో చట్టబద్ధంగా వివాహం జరిగింది.

అనంతరం జీవిత భాగస్వామి వీసాపై 2018 ఆగస్టులో భావినీ అతనిని ఇంగ్లాండ్‌కు తీసుకొచ్చింది.అయితే వీరిద్దరికి బేధాభిప్రాయాలు రావడంతో విడిపోయారు.జిగుకుమార్‌ను హిందూ సాంప్రదాయం ప్రకారం భావినీ వివాహం చేసుకోవాల్సి వుంది.

అయితే ఆమె హత్యకు ముందు రోజు భావిని కుటుంబం ఈ పెళ్లిని విరమించుకుంది.మరోవైపు పోలీసులకు లొంగిపోయే సమయంలో భావిని ప్రవీణ్ తన జీవితాన్ని నాశనం చేసిందని జిగుకుమార్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు