కాలింగ్ బెల్ కొడుతూ ఆడుతున్నారని.. ముగ్గురు పిల్లల దారుణ హత్య, అమెరికాలో భారతీయుడి ఘాతుకం

అమెరికాలో( America ) భారత సంతతి వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.ముగ్గురు బాలురను హతమార్చాడు.

ఇంతకీ వారు చేసిన నేరం ఏంటో తెలుసా.తన ఇంటి కాలింగ్ బెల్‌ను( Calling Bell ) తరచు మోగించడమే.

దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నిందితుడు పిల్లలను చంపాడు.ఈ కేసుకు సంబంధించి అతనిని కోర్ట్ దోషిగా తేల్చింది.

నిందితుడిని రివర్‌సైడ్ కౌంటీ నివాసి అనురాగ్ చంద్రగా( Anurag Chandra ) నిర్ధారించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.జనవరి 19, 2020న ఈ హత్యలు జరిగాయి.

Advertisement

ఘటన జరిగిన సమయంలో అప్పటికే 12 బీర్లు తాగిన చంద్రకు.పిల్లలు పదే పదే కాలింగ్ బెల్ మోగించడంతో చిర్రెత్తుకొచ్చింది.

బెల్ కొట్టి పారిపోతూ ఒక కుర్రాడు.తన పిర్రలను ఊపుతూ హేళన చేయడంతో చంద్రకు కోపం నషాళానికి అంటింది.

ఆ మత్తులోనే కాలింగ్ బెల్ కొట్టి పారిపోతున్న ముగ్గురు బాలురు ప్రయాణిస్తున్న కారును వెంటాడాడు.ఈ క్రమంలో వారి కారును ఢీకొట్టగా.

అది నేరుగా చెట్టుకు గుద్దుకుంది.ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మరణించగా 13 ఏళ్ల వయసున్న బాలుడు, మరో 18 ఏళ్ల యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

ఈ కేసు కంటే ముందు 2020లో గృహహింస ఘటనకు సంబంధించిన అభియోగాలను చంద్ర ఎదుర్కొంటున్నాడు.

Advertisement

ఇదిలావుండగా.అనవసరమైన ప్రిస్క్రిప్షన్‌లు, మోసపూరిత క్లెయిమ్‌లను సమర్పించడం ద్వారా న్యూజెర్సీ రాష్ట్రంతో పాటు స్థానిక హెల్త్‌కేర్ పథకాలను పొందడంతో పాటు, ఇతర బీమా సంస్థలను మోసం చేసిన భారత సంతతి వైద్యుడిని ఈ ఏడాది మార్చిలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

నిందితుడిని 51 ఏళ్ల సౌరభ్ పటేల్‌గా గుర్తించారు.నెవార్క్‌లో మెడికల్ క్లినిక్‌ వున్న అతను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ బీ.కుగ్లెర్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరై తన నేరాన్ని అంగీకరించాడు.అప్పటికే సౌరభ్‌పై హెల్త్ కేర్ మోసానికి పాల్పడ్డట్లుగా అభియోగాలు మోపారు ప్రాసిక్యూటర్లు.

న్యూజెర్సీలోని వుడ్‌బ్రిడ్జికి చెందిన వ్యక్తి సౌరభ్ పటేల్.ఇతని కుటుంబానికే చెందిన కైవల్ పటేల్‌తో సౌరభ్.

హెల్త్ కేర్ మోసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు.

తాజా వార్తలు