యూకే: పన్ను ఎగవేత కేసులో భారతీయ వ్యాపారవేత్తపై నిషేధం

వేల కోట్లు సంపాదిస్తున్నా ప్రభుత్వానికి న్యాయంగా చెల్లించాల్సిన ఆదాయపు పన్నుకు సంబంధించిన డబ్బును పలువురు దొడ్డిదారిలో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో కూడబెడుతున్నారు.

మనదేశంలో ప్రభుత్వాలు మారినా, నల్ల ధనానికి మాత్రం చెక్ పడటం లేదు.

అయితే పొట్ట చేత పట్టుకుని పరాయి దేశం వెళ్లినా కొందరు భారతీయుల్లో మాత్రం అక్రమ సంపాదన మీద మోజు తగ్గడం లేదు.తాజాగా బ్రిటన్‌లో స్థిరపడిన ఓ భారత సంతతి వ్యాపార వేత్త పన్ను ఎగవేత కేసులో ఆరేళ్ల నిషేధానికి గురయ్యాడు.

వివరాల్లోకి వెళితే.బ్రిట‌న్‌లోని లిసెస్ట‌ర్‌ ఈస్ట్‌మిడ్‌ల్యాండ్ టౌన్‌లో మ‌హిళ‌ల దుస్తుల త‌యారీ కంపెనీకి డైరెక్ట‌ర్‌గా సురేందర్ సింగ్ వ్యవహరిస్తున్నారు.

ఈయన ప‌న్ను ఎగవేత కేసులో దోషిగా తేలడంతో ఆరేండ్ల నిషేధం విధిస్తున్న‌ట్లు బ్రిట‌న్ ఇన్ సాల్వెన్సీ అధికారులు బుధ‌వారం ప్రకటించారు.సురేంద‌ర్ 2018 ఏప్రిల్ నుంచి 98 వేల ఫౌండ్ల టాక్స్ బిల్లు చెల్లించాల్సి వుందని తెలిపారు.

Advertisement

ప‌న్ను చెల్లించ‌డంలో విఫ‌ల‌మైనందుకు గాను ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా 2019 జూలైలో సురేందర్‌ను కంప‌ల్స‌రీ లిక్విడేష‌న్‌లో పెట్టారు.

అంతేకాకుండా సురేందర్ 2017 నవంబ‌ర్ నుంచి 2019 మార్చి వ‌ర‌కు 1.80 ల‌క్ష‌ల పౌండ్ల‌ను విత్ డ్రా చేసుకున్నాడు.కానీ అందుకు గల కార‌ణాలను మాత్రం వెల్ల‌డించ‌లేదు.

ఇన్సాల్వెన్సీ స‌ర్వీస్ చీఫ్ ఇన్వెస్టిగేట‌ర్ రాబ‌ర్ట్ క్లార్క్ మాట్లాడుతూ.సురేందర్ స‌రైన రికార్డులు లేకుండా దాచి పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాడ‌ని తెలిపారు.

త‌ద్వారా ప‌న్ను బ‌కాయిలు చెల్లించ‌కుండా అన‌వ‌స‌ర అడ్వాంటేజ్‌తో ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నించాడ‌ని రాబ‌ర్ట్ క్లార్క్ చెప్పారు.--.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు