వాతావరణ మార్పులపై కృషి.. భారత సంతతి నేతకు బ్రిటన్‌లో అరుదైన గౌరవం

భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ మంత్రి అలోక్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది.కింగ్స్ న్యూఇయర్ హానర్స్ లిస్ట్‌లో ఆయనకు స్థానం లభించింది.COP26 శిఖరాగ్ర సదస్సు ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో చేసిన కృషికి గాను అలోక్ శర్మకు ఈ గౌరవం దక్కింది.ఆయనతో పాటు భారత సంతతికి చెందిన ప్రచారకులు, ఆర్ధికవేత్తలు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు 30 మందికి కూడా ఈ హానర్స్ లిస్ట్‌లో చోటు లభించింది.

 Indian Origin Ex Uk Minister Alok Sharma Knighted In King's New Year Honours Lis-TeluguStop.com

ఎకనామిక్స్, నేచురల్ ఎన్విరాన్‌మెంట్‌కు చేసిన సేవల కోసం ప్రొఫెసర్ సర్ పార్థసారథి దాస్‌గుప్తాకు నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ (జీబీఈ)కి ఎంపికయ్యారు.

భారత్‌లోని ఆగ్రాలో జన్మించిన 55 ఏళ్ల శర్మ.

దక్షిణ ఇంగ్లాండ్‌లోని రీడింగ్ వెస్ట్ నుంచి 2010 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.నాటి నుంచి వాణిజ్యం , గృహ నిర్మాణం, ఉపాధి విభాగాలలో ఆయన పలు హోదాల్లో పనిచేశారు.బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ కేబినెట్‌లలో అలోక్ శర్మ విధులు నిర్వర్తించారు.COP26కు నాయకత్వం వహించి వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో, భవిష్యత్‌లో వాతావరణ మార్పులను పరిష్కరించేందుకు చారిత్రక ఒప్పందాన్ని అంగీకరించేలా యూకేని నడిపించినందుకు అలోక్ శర్మకు నైట్ హుడ్ లభించింది.

కాప్ 26:

Telugu Alok Sharma, Conference, Uk, Indian Origin, London, Honours List, British

వాతావరణ మార్పులను నియంత్రించేందుకు గాను 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కుదిరింది.దానిపై సంతకాలు చేసిన దేశాల సమావేశాన్ని ‘కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)’గా వ్యవహరిస్తున్నారు.1995లో కాప్ తొలి సమావేశం జరిగింది.ఆరేళ్ల క్రితం 2015 పారిస్లో జరిగిన సమావేశంలో ఓ కీలక ఒప్పందానికి ఆయా దేశాలు అంగీకరించాయి.

గతేడాది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 13 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో యూన్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ (COP26) జరిగింది.

ఇకపోతే.

ఈ నెల ప్రారంభంలో లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో యూకే రాజకుటుంబం నుంచి భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త, స్వచ్ఛంద సేవా కార్యకర్త మోహన్ మాన్సిగాని ప్రతిష్టాత్మక ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్’’ (ఓబీఈ) అందుకున్నారు.నార్త్ లండన్‌కు చెందిన మోహన్.

సెయింట్ జాన్ అంబులెన్స్ ఛారిటీకి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.సమాజానికి ఆయన చేసిన సేవలకు గాను గతేడాది దివంగత బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 జన్మదిన వేడుకల సందర్భంగా ఈ అవార్డ్‌ను ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube