అనుపమ నామసంవత్సరంగా మారిన 2022..అదరగొట్టేసింది గా !

అనుపమ పరమేశ్వరన్… గడిచిన ఏడాది అమ్మడికి అదృష్టం బాగానే ఉంది.అందుకే 2015 లో ఎంట్రీ ఇచ్చినప్పటికి అర కొర పాత్రలు లేదంటే సెకండ్ లీడ్ రోల్స్ చేస్తూ సరి పెట్టుకుంటు వచ్చింది.

 Anupama Parameshwaran Success Rate In 2022 Details, Anupama Parameswaran, Anupam-TeluguStop.com

పుష్కలంగా ట్యాలెంట్ ఉన్నప్పటికీ అనుపమ కి లక్కు మాత్రం కలిసి రాలేదు.కానీ 2022 ఆమెను ఒక స్టార్ హీరోయిన్ గా, ప్యాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది అనే చెప్పాలి.

ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించిన, మెయిన్ లీడ్ గా చేసిన అనుపమ కు మాత్రం మంచి పాత్రలు పడలేదు.తెలుగు తో పాటు తమిళ్, మలయాళ భాషల్లో నటిస్తున్న వచ్చిన క్రేజ్ పెద్దగా ఏమి లేదు.

ఇక 2022 ను అనుపమనామ సంవత్సరంగా పోల్చిన పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.ఈ ఏడాది మొదట్లోనే దిల్ రాజు అన్న కొడుకు తో రౌడీ బాయ్స్ సినిమాలో నటించింది.

ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది.ఆఖరుకు నాని సినిమా అంటే సుందారానికి చిత్రంలో అతిథి పాత్రలో కూడా నటించింది.

ఎంత చేసిన, ఎలాంటి పాత్ర వచ్చిన అమే కెరీర్ అంతంత మాత్రం గానే కొనసాగింది.అప్పుడు వచ్చింది అమే కెరీర్ ని టర్న్ చేసే సినిమా.

Telugu Pages, Karthikeya, Rowdy-Movie

అదే కార్తికేయ 2. ఈ సినిమా లో అమే రోల్ ఎంత ఉంది, ఆమెకు నటించడానికి ఎంత స్కోప్ ఉంది అని పక్కన పెడితే పాన్ ఇండియాలో మాత్రం అమే పరిచయం బాగానే అయ్యింది.ఈ సినిమా ఇంత రేంజ్ హిట్ అవుతుంది అని అటు అనుపమ తో పాటు ఎవరు ఊహించలేదు.ఇక ఆ తర్వాత వచ్చింది 18 పేజెస్ చిత్రం.

చిత్రం ఫలితం పక్కన పెడితే కమర్షియల్ గా మాత్రం లాభాల బాటలో కొనసాగుతుంది.అందులో అనుపమ కి మంచి క్రెడిట్ కూడా వచ్చింది.

ఇక కార్తికేయ విజయానికి.ముందు బట్టర్ ఫ్లై అనే సినిమా ఒప్పుకుంది.

Telugu Pages, Karthikeya, Rowdy-Movie

అది ఓటిటి లో మాత్రమే విడుదల అయ్యింది.ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ అన్ని అనుపమ మాత్రమే.ఒక స్టార్ హీరోయిన్ అవ్వడానికి కష్టాలు పడుతున్న అనుపమ ఇలా ఒక లీడ్ రోల్ లో ఉమెన్ సెంట్రిక్ గా ఒక సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.అమే భుజాలపైన చాలా పెద్ద బాధ్యత పెట్టుకొని పర్వాలేదు అనిపించుకుంది.

ఒక రకంగా అమే ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయ్యింది.ఇక ఇప్పుడు అమే చేతిలో ఒక తెలుగు, ఒక తమిళ్ సినిమాతో పాటు ఒక మలయాళ చిత్రం కూడా ఉంది.

ఈ చిత్రాలు పూర్తయితే మరి కొన్నేళ్ళు అమే కెరీర్ కి ఎలాంటి డోకా లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube