దక్షిణాఫ్రికా: ఇండియాకు అక్రమంగా స్క్రాప్ కంటైనర్లు.. భారత సంతతి వ్యాపారికి భారీ జరిమానా

భారతదేశానికి అక్రమంగా స్క్రాప్ మెటల్స్‌తో నిండిన కంటైనర్లను పంపేందుకు ప్రయత్నించిన ఇద్దరు భారత సంతతి వ్యాపారవేత్తలకు దక్షిణాఫ్రికా కోర్ట్ భారీ జరిమానా విధించింది.రెండు వేర్వేరు కేసులలో అరెస్ట్ అయిన ఈ ఇద్దరు బిజినెస్‌మెన్లకు సంబంధించి ఒక కేసులో డర్బన్ మేజిస్ట్రేట్ కోర్టు గత వారం జరిమానా విధించింది.

 Indian-origin Businessmen Get Hefty Fines For Attempted Illegal Scrap Metal Expo-TeluguStop.com

ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా భారతదేశానికి మెటల్ స్క్రాప్‌ను ఎగుమతి చేసేందుకు ప్రయత్నించిన నాగేంద్ర కుడుపూడికి 2,00,00 ర్యాండ్ల జరిమానా విధించారు న్యాయమూర్తి.

కుడుపూడి నాలుగు విడతల్లో ఈ జరిమానాను చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది.

తొలి వాయిదా కింద 50,000 ర్యాండ్‌లను నవంబర్ చివరి నాటికి చెల్లించాల్సి వుంటుంది.లేనిపక్షంలో నాగేంద్రకు ఐదేళ్ల జైలు శిక్ష పడే ప్రమాదం వుంది.

స్టీల్ స్క్రాప్ మెటల్ ‌తో నిండిన కన్‌సైన్‌మెంట్ బరువు 1,25,000 కిలోల బరువు కలిగి వుంది.రీజినల్ నేషనల్ ప్రాసిక్యూషన్ అథారిటీ ప్రతినిధి నటాషా కారా అంచనా ప్రకారం.

బహిరంగ మార్కెట్‌లో ఈ కన్‌సైన్‌మెంట్ విలువ 3,69,750 ర్యాండ్‌లు.

పాతికేళ్లుగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నాగేంద్ర ఈ ఏడాది ఫిబ్రవరిలో డర్బన్ పోర్ట్ నుంచి భారత్‌కు ఎగుమతి చేసేందుకు ఐదు కంటైనర్లను సిద్ధంగా వుంచినట్లు నటాషా తెలిపారు.

అయితే ఎగుమతి అనుమతికి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ కమీషన్ (ఐటీఏసీ)కి దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.దక్షిణాఫ్రికా రెవెన్యూ సర్వీస్ విచారణ తర్వాత అతనిని అరెస్ట్ చేసినట్లు కారా మీడియాకు తెలిపారు.

కుడుపూడి 2,00,000 ర్యాండ్ల జరిమానా చెల్లించాలని లేనిపక్షంలో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుందని నటాషా అన్నారు.అయితే భారత సంతతికి చెందిన మరో వ్యాపారవేత్త దీపక్ కుమార్ మేథా సైతం ఇదేరకమైన కేసులో అరెస్ట్ చేశారు.

డర్బన్ నుంచి భారత్‌కు ఎగుమతి చేయడానికి స్క్రాప్ మెటల్‌తో నిండిన ఐదు కంటైనర్లను అక్రమంగా వుంచినందుకు గాను అభియోగాలను ఎదుర్కొంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube