Sudhir : ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అరుదైన ఘటన .. సెనేటర్‌గా భగవద్గీతపై ప్రమాణం చేసిన భారత సంతతి నేత

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు తమ మూలాలను మరిచిపోవడం లేదు.దేశం కానీ దేశంలోనూ ప్రతినిత్యం పూజలు చేసే వారు, ఆలయాలను సందర్శించేవారు ఎందరో వున్నారు.

ఇక హిందూ మత విశ్వాసాలను గట్టిగా పాటించే బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్( British Prime Minister Rishi Sunak ).2019లో హౌజ్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన సమయంలో భగవద్గీతపై చేతులు పెట్టి ప్రమాణం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

కొన్నేళ్ల క్రితం అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రంలో డైల్‌హై మేయర్‌గా చిత్తూరు జిల్లా వాసి ఎన్నికైన సంగతి తెలిసిందే.బుచ్చినాయుడు కండ్రిగకు చెందిన ఎన్‌ఆర్‌ఐ సముద్రాల బాబురావు తనయుడు సుధీర్‌ ( Sudhir )ఈ పదవికి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా సుధీర్.

భగవద్గీతపై ప్రమాణం చేసి తాను ఎక్కడున్నా భారతీయుడినే అని రుజువు చేశారు.

తాజాగా ఆస్ట్రేలియా సెనేటర్‌గా ఎన్నికైన వరుణ్ ఘోష్ ( Varun Ghosh )అనే భారత సంతతి నేత కూడా ఆ దేశ పార్లమెంట్‌లో భగవద్గీతపై( Bhagavad Gita ) ప్రమాణ స్వీకారం చేశారు.ఇలా చేసిన తొలి వ్యక్తి ఆ దేశ చరిత్రలో వరుణ్ ఒక్కరే.ఫెడరల్ పార్లమెంట్ సెనేట్‌లో ప్రాతినిథ్యం వహించడానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆయనను ఎంపిక చేయడంతో పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి వరుణ్ ఘోష్ కొత్త సెనేటర్‌గా నియమితులయ్యారు.

Advertisement

వరుణ్‌కు ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్( Penny Wong ) స్వాగతం పలుకుతూ.మీరు లేబర్ సెనేట్ బృందంలో ఉండటం అద్భుతంగా వుందన్నారు.

ఆయన తన కమ్యూనిటీకి, వెస్ట్ ఆస్ట్రేలియన్లకు బలమైన గొంతుకగా వుంటారని పెన్నీ వాంగ్ ఆకాంక్షించారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్( Australian Prime Minister Anthony Albanese ) కూడా వరుణ్ ఘోస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కొత్త సెనేటర్‌కు స్వాగతమని, మీరు జట్టులో వుండటం అద్భుతంగా వుందని ప్రధాని తన ఎక్స్ (గతంలో ట్విట్టర్‌)లో పోస్ట్ చేశారు.పెర్త్‌కు చెందిన వరుణ్ ఘోష్ వృత్తి రీత్యా న్యాయవాది.

వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ నుంచి కళలు, న్యాయశాస్త్రంలో డిగ్రీలను పొందిన ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కామన్‌వెల్త్ స్కాలర్‌తో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు.న్యూయార్క్‌లో ఫైనాన్స్ అటార్నీగా, వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ సలహాదారుగానూ వరుణ్ పనిచేశారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
అమ్మో, గడ్డకట్టిన సరస్సుపై కుక్క.. ప్రాణాలకు తెగించి రక్షించిన భారతీయుడు..

పెర్త్‌లోని ఆస్ట్రేలియా లేబర్ పార్టీలో చేరడంతో వరుణ్ ఘోష్ రాజకీయ జీవితం ప్రారంభమైంది.పశ్చిమ ఆస్ట్రేలియాలో , అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంక్‌తో న్యాయపరమైన విషయాలను డీల్ చేసే బారిష్టర్‌గా ఆయన సేవలందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు