ఉగాండాలో భారతీయుడిని కాల్చిచంపిన పోలీస్ .. అప్పు తీర్చమన్నందుకు ఘాతుకం

ఆఫ్రికా దేశం ఉగాండాలో( Uganda ) దారుణం జరిగింది.భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని ఓ కానిస్టేబుల్ కాల్చిచంపాడు.

వివరాల్లోకి వెళితే.మే 12న ఈ ఘటన జరిగింది.

మృతుడిని 39 ఏళ్ల ఉత్తమ్ భండారీగా( Uttam Bhandari ) గుర్తించారు.ఇతనిపై నిందితుడు ఇవాన్ వాబ్‌వైర్( Ivan Wabwire ) కాల్పులు జరిపినట్లు కంపాలా మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

కంపాలా కేంద్రంగా నడిచే వార్తాపత్రిక డైలీ మానిటర్ ప్రకారం.భండారీ టీఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ అని.వాబ్‌వైర్ అతని క్లయింట్ అని పోలీసులు పేర్కొన్నారు.కానిస్టేబుల్ అతని సంస్థకు చెల్లించాల్సిన మొత్తం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో మే 12న భండారీ తమకు చెల్లించాల్సిన 2.1 మిలియన్ షిల్లింగ్‌ల (భారత కరెన్సీలో రూ.46,000) గురించి వాబ్‌వైర్‌‌కు చెప్పాడు.దీనిపై నిందితుడు భండారీతో వాదనకు దిగాడు.

Advertisement

ఈ క్రమంలోనే వాబ్‌వైర్ ఆగ్రహంతో ఊగిపోతూ తన దగ్గర వున్న ఏకే 47 రైఫిల్‌తో భండారీపై కాల్పులు జరిపి అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అక్కడి నుంచి 13 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

అయితే వాబ్‌వైర్‌ గతంలో మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని.పలుమార్లు ఆసుపత్రిలో కూడా చేరాడని పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా అతను తుపాకీ వాడకుండా ఐదేళ్ల క్రితం నిషేధించామని చెప్పారు.అయితే వాబ్‌వైర్‌ తన తోటి పోలీస్, రూమ్ మేట్ నుంచి తుపాకీని దొంగిలించాడని అధికారులు చెబుతున్నారు.

నిందితుడిని ప్రస్తుతం తూర్పు ఉగాండాలోని బుసియా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు.ఈ ఘటన నేపథ్యంలో ఉగాండాలోని భారతీయ కమ్యూనిటీ తీవ్ర భయాందోళనలకు గురైంది.అయితే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జియెఫ్రీ టుముసీమ్ కట్సిగాజీ ఉగాండాలోని భారతీయ కమ్యూనిటీ ప్రతినిధులను కలుసుకుని.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

వారి భద్రతపై హామీ ఇచ్చారు.అటు ఈ ఘటన గురించి తెలుసుకున్న ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

అసలు విధుల్లో లేని పోలీస్ తుపాకీని ఎలా యాక్సెస్ చేశాడంటూ ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తుపాకులను పోలీసులు ఎలా భద్రపరుస్తున్నారు.అసలు సాయుధుడైన వ్యక్తిని భండారీ వుంటున్న భవనంలోకి ఎలా అనుమతించారు అని ప్రశ్నిస్తూ యోవేరి ట్వీట్ చేశారు.

కాగా.ఉగాండాలో ఇటీవలి కాలంలో తుపాకీ కాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి.

ఈ నెల ప్రారంభంలో .వ్యక్తిగత విభేదాల కారణంగా 26 ఏళ్ల ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును అతని సహోద్యోగి కాల్చి చంపినట్లు డైలీ మానిటర్ తెలిపింది.

తాజా వార్తలు